Sudheer Babu: సుధీర్ బాబు తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని. టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ అల్లుడిగా, మహేష్ బాబు బావగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈయన సినిమాలలో సపోర్టింగ్ పాత్రలలో నటించారు.నాగచైతన్య సమంత నటించిన ఏ మాయ చేసావే సినిమాలో సమంత అన్నయ్య పాత్రలో నటించిన సుధీర్ బాబు అనంతరం హీరోగా అవకాశాలు అందుకొని హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తున్నారు.
ఈ విధంగా తన సినీ కెరియర్లో ఎన్నో సినిమాలలో నటించినప్పటికీ సుధీర్ బాబుకు సరైన హిట్ తెచ్చింది మాత్రం ఏ సినిమా లేదని చెప్పాలి. ఇకపోతే తాజాగా ఈయన మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే సినిమా ద్వారా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఈ సినిమా కూడా సుధీర్ బాబుకు చేదు అనుభవాన్ని మిగిల్చింది.
ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్న సుధీర్ బాబుకు చేదు అనుభవమే ఎదురయిందని చెప్పాలి.ఇలా పలు సినిమాలలో నటిస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నప్పటికీ ఈయనకు మాత్రం ఏ సినిమా పెద్దగా కలిసి రాలేదు.హీరోగా తనకు ఇండస్ట్రీలో కలిసి రాలేదని ఈయన విలన్ పాత్రలలో కూడా నటించినప్పటికీ విలన్ పాత్రలు కూడా పెద్దగా పేరు తెచ్చిపెట్టలేదు.
Sudheer Babu: మరోసారి సుధీర్ బాబుకు ఎదురైన చేదు అనుభవం..
ఈ విధంగా సుధీర్ బాబు హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడం కోసం వరుస సినిమాలలో నటించినప్పటికీ ఈయనకు ఇండస్ట్రీలో వరుసగా చేదు అనుభవాలు మాత్రమే మిగులుతున్నాయి.ఈ సినిమా అయినా తన కెరీర్లు చెప్పుకోదగ్గ సినిమాగా నిలబడుతుందని సుధీర్ బాబు భావించి ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఫ్లాప్ టాక్ మూటగట్టుకుంది. మరి ఈయనకు సరైన హిట్ ఎప్పుడు పడుతుందో వేచి చూడాల్సిందే.