Ram Charan : రౌద్రం రణం రుధిరం , ఆర్ఆర్ఆర్ ఈ చిత్రం ఇండియా నే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులను అత్యంత ప్రభావితం చేసింది. దర్శక ధీరుడు జక్కన్న క్రియేటివిటీ, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల పెర్ఫార్మెన్స్ అశేషంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయిన ఈ చిత్రం కలెక్షన్ల పరంగానే కాదు, హాలీవుడ్ సినిమాలతో కూడా పోటీపడింది. ఆస్కార్ లో ఈ సినిమాకి అవార్డులు రావాలని ప్రతి ప్రేక్షకుడు కోరుకున్నాడు. ఇక్కడి అభిమానులే కాదు ఇంటర్నేషనల్ ఆడియన్స్ కూడా అదే కోరుకున్నారు. ప్రజలు మెచ్చిన సినిమా కావడంతో ఈ మధ్యనే ఎన్టీఆర్ పేరు బెస్ట్ యాక్టర్ గా ఆస్కార్ లిస్టులో చోటు దక్కిందని ప్రపంచ ఫేమస్ మ్యాగజిన్ వెరైటీలో ప్రచురించింది. ఈ శుభవార్త విన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ పండుగ చేసుకున్నారు. తాజాగా మరో అప్డేట్ ఈ మ్యాగ్జిన్ ఇచ్చింది. ఎన్టీఆర్ తో పాటు రామ్ చరణ్ కు ఆస్కార్ వచ్చే అవకాశం ఉందని ప్రకటించింది. దీంతో ఇప్పుడు సెలబ్రేషన్స్ వంతు రామ్ చరణ్ ఫ్యాన్స్ ది అయ్యింది.

Ram Charan : ఆర్ ఆర్ సినిమా విడుదలై చాన్నాలయినా ఇంకా రికార్డుల పరంపర కంటిన్యూ అవుతూనే ఉంది. తెలుగు , కన్నడ , మలయాళం, తమిళ , హిందీ భాషల్లో విడుదలై అత్యంత ప్రజాదరణ పొందిన సినిమా ఇది. జక్కన్న చెక్కిన ఈ చిత్రం అత్యంత జనాదరణ పొందిన చిత్రంగా మారింది. థియేటర్లలోనే కాదు ఓటీపీ లోను ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. భారత్ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ వసూళ్లను రాబెట్టిన సినిమా ఇది. అసలు ఎవరి ఊహకు అందని విధంగా కథను రూపొందించి , చరిత్రలోనే కలవని ఫేమస్ పర్సనాలిటీస్ ని సినిమా ద్వారా ఏకం చేసి తన వైవిధ్యమైన దర్శకత్వంతో ప్రేక్షకులు కావాల్సింది అందించాడు జక్కన్న.

Ram Charan : ఎన్టీఆర్, రామ్ చరణ్ లు ఈ కథకు ప్రాణం పోశారు. ఆ పాత్రలో నటించి కాదు కాదు ఏకంగా జీవించేశారు . ఒళ్ళు హూనం చేసుకుని మరీ తమ నటనా నైపుణ్యంతో ప్రేక్షకులను అలరించారు. భారత్ లోనే ఈ సినిమా సక్సెస్ ఆగిపోలేదు ఖండాంతరాల్లోనూ ఈ సినిమాకి ఖ్యాతి దక్కింది. ఓవర్సీస్ లోనూ భారీ వసూళ్ల ను ప్రేక్షక ఆదరణను పొందింది ఆర్ఆర్ఆర్. తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయిలో మరో మెట్టు ఎదిగేలా చేసింది ఈ మూవీ. ఆస్కార్ లో చోటు దక్కించుకొని అందరిని గర్వపడేలా చేస్తోంది. ఏది ఏమైనా ఆస్కార్ బరిలో నిలిచిన ఎన్టీఆర్ , రామ్ చరణ్ లకి అవార్డులు కనుక అందితే ఆ ఆనందమే వేరు అంటున్నారు అభిమానులు.