కార్తీక్‌కి దగ్గర అవ్వాలని జ్వరం వచ్చినట్టు నాటకం ఆడుతుంది మోనిత. తనకు అలా అవడం చూసి నిజంగానే వేరే డాక్టర్ని తీసుకొస్తాడు కార్తీక్. అది మరెవరో కాదు దీపకి ఆశ్రయం ఇచ్చిన డాక్టర్ అన్నయ్య. అయితే ఆ డాక్టర్ మాత్రం జ్వరం నిజంగానే వచ్చిందని చెప్పి మందులు రాసిస్తాడు. అది చూసి షాక్ అయ్యి.. అతన్ని నిలదీస్తుంది. మరోవైపు హేమ తన తమ్ముడు గురించి వరకు వెతుకుతూ ఉంటుంది. ఆ పిల్లాడు ఉన్నచోటికి వెళ్లి తమకి ఇచ్చేయమని అడుగుతుంది. మోనిత ఇవ్వొద్దు అన్నదని చెప్పి ఆ పిల్లాడిని ఇవ్వడానికి ఒప్పుకోరు అతని బాబాయ్, పిన్ని. ఇంకోవైపు కొడుకుని తీసుకొస్తే కార్తీక్ తనని ప్రేమిస్తాడని.. అతనిని తీసుకురావడానికి సిద్ధమవుతుంది మోనిత. అలాగే దీప కావాలనే రకరకాలుగా నాటకాలు ఆడుతుందని ఉన్నవి లేనివి కార్తీక్ కి చెబుతుంది మోనిత. దాంతో కోపంగా దీప దగ్గరికి వెళతాడు కార్తీక్. ఆ తర్వాత సెప్టెంబర్ 15 ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దాం..
కోపంతో ఊగిపోతూ దీప దగ్గరికి వెళ్తాడు కార్తీక్. గట్టిగా అరుస్తూ దీపాన్ని బయటకు పిలుస్తాడు. అది చూసి అయోమయంగా దీప బయటికి వస్తుంది. వెంటనే ఎందుకు ఇలా చేస్తున్నావ్ అని అరుస్తుంటాడు కార్తీక్. నేనేం చేశాను అని అడుగుతుంది దీప. దాంతో చిన్న తలనొప్పి వస్తే వంటగదికి వెళ్లొద్దని, వంటమనిషిని పెట్టకోమని మీ డాక్టర్ అన్నయ్యతో చెప్పిస్తావా అరుస్తాడు కార్తీక్. తనేం తప్పు చేయలేదని దీప చెప్పిన ఏ మాత్రం లెక్క చేయడు. అంతేకాకుండా.. మోనిత ఎన్నిసార్లు చెప్పినా తనే అనవసరంగా దీపని వెనకేసుకొచ్చానని అంటాడు కార్తీక్. తన మీద కన్నేశావని మోనిత ఎన్నిసార్లు చెప్పినా తనే దీప అలాంటిది కాదని ప్రతిసారి సమర్థిస్తూ వచ్చానని కానీ ఆ మాట నిలబెట్టలేదని దీపపై నిందలు వేస్తాడు కార్తీక్. ఇంకెప్పుడూ ఇలా ప్రవర్తించొద్దని దీపకి గట్టిగా వార్నింగ్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్లిపోతాడు కార్తీక్. భర్త అలా అనడంతో ఏం చేయాలో పాలు పోక తనలో తానే కుమిలిపోతూ చూస్తూ ఉండిపోతుంది దీప.
మరోవైపు.. తన కొడుకు ఆనంద్‌ని ఎలాగైనా తన దగ్గరకు తీసుకొస్తే.. కార్తీక్ తప్పకుండా తనను ప్రేమిస్తాడని అనుకుంటుంది మోనిత. కానీ కార్తీక్‌ని అక్కడే ఉంచి వెళితే దీప ఎలాగైనా తనవైపు తిప్పుకుంటుందని బాధపడుతుంది. అలాగే చెన్నై తీసుకెళ్తే అది ఇంకా ప్రమాదమని భయపడుతుంది. తను చెన్నై వెళ్లే రెండు రోజులు దీపని కూడా ఎలాగైనా అక్కడ ఉండకుండా చేస్తే సమస్య లేకుండా పోతుందని అనుకుంటుంది. దానికోసం ఓ ప్లాన్ రెడీ చేసుకుంటుంది మోనిత.
మరో సన్నివేశంలో.. దీప డాక్టర్ అన్నయ్య ఇంటికి వెళ్తుంది. అక్కడ డాక్టర్ కి, ఆయన తల్లికి కార్తీక్ చేసిన గొడవ గురించి చెబుతుంది. అది విని డాక్టర్ బాబు తప్పకుండా తన సొంతమవుతాడని ఓదార్చే ప్రయత్నం చేస్తాడు డాక్టర్ అన్నయ్య. అయితే మోనిత తన కాలర్ పట్టుకుని నిలదీసిన విషయం గుర్తుతెచ్చుకొని.. అది సామాన్యురాలు కాదని చెబుతాడు. కానీ ఇలాంటి సమస్యలను ఇంతకుముందే ఎన్నో దాటి వచ్చిన దీపకి పెద్దగా కష్టం కాదని ఓదార్చుతాడు. అయితే మోనితని తక్కువ అంచనా వేయకూడదని సలహా కూడా ఇస్తాడు డాక్టర్ అన్నయ్య. అది నిజమే అని డాక్టర్ బాబును తన దగ్గరకు ఎలా తెచ్చుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది దీప.
ఇక్కడ హిమ మాత్రం తన తమ్ముడు ఆనంద్ ని ఇంటికి తీసుకొద్దామని తాత ఆనందరావుని బ్రతిమిలాడుతూ ఉంటుంది. అయితే ఆ బాబుని ఇంటికి తీసుకొస్తే చనిపోయిన కార్తీక్ మీద మచ్చ పడుతుందని తనలో తానే బాధపడుతూ ఉంటాడు ఆనందరావు. ఆ విషయం హిమా కి చెప్పకుండా ఏదో ఒకటి ఆలోచిద్దామని మాట దాట వేస్తాడు ఆనందరావు. ఇంకోవైపు సౌర్యని ఇంట్లోనే వదిలేసి వెళ్లడానికి ప్లాన్ చేస్తుంటారు వారణాసి, చంద్రమ్మ. కానీ ఇలాంటిదే ఏదో జరుగుతుందని ముందే ఊహించిన సౌర్య గుమ్మం ముందే కాపలా కాసి ఉంటుంది. వారి మాటలు విని.. తనను వదిలేసి వెళ్లడానికి ప్లాన్ వేస్తున్నారా అని అరుస్తుంది. ఇంతలో అక్కడికి వచ్చిన ఇంద్రుడు నీ గొంతు బాలేదు కదా అమ్మ బయటికి వెళ్తే నీకు ఏమైనా అవుతుందని మీ పిన్ని భయపడుతుందని సర్ది చెప్తాడు. ఏం పర్లేదని ఒక గంటలో తిరిగి వస్తామని అంటాడు వారణాసి. అయితే.. అమ్మ నాన్న దొరికినా వారిని తనతో పాట తీసుకెళ్లి.. అందరం కలిసి ఒక ఇంట్లో ఉండొచ్చని.. వారిని బాధపడొద్దని ఎమోషనల్ గా చెబుతుంది సార్య. సౌర్య వెళ్లిన తర్వాత తన గురించే మాట్లాడుకుంటూ బాధపడతారు చంద్రమ్మ, ఇంద్రుడు.
అక్కడ దీప మాత్రం కార్తీక్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అందుకే డాక్టర్ అన్నయ్య, ఆయన తల్లి కి భోజనం వడ్డిస్తూ.. డాక్టర్ బాబును బలవంతంగా అక్కడికి తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేయిస్తే గతం గుర్తొస్తుంది కదా అని డాక్టర్ అన్నతో అంటుంది దీప. అది విని.. అది చాలా ప్రమాదం అని.. అలా చేస్తే డాక్టర్ బాబు దీపకి శాశ్వతంగా దూరమైపోయే అవకాశం ఉందని చెబుతాడు డాక్టర్ అన్నయ్య. అదే నిజమే అని సైలెంట్ అయిపోతుంది దీప. అనంతరం ఓ ఇద్దరు మహిళలు మోనిత దగ్గరకు వెళ్లి తన భర్తకి ప్రకృతి వైద్యశాలలో చికిత్స చేస్తే గతం గుర్తుకొస్తుందని చెబుతారు. అది విని వద్దని వాళ్లతో కోపంగా చెబుతుంది మోనిత. అక్కడే ఉన్న దీప తను పంపించదని తిట్టుకుంటూ ఉంటుంది. తరువాయి భాగం అంటూ.. ఇంద్రుడు నడిపే ఆటో దగ్గరికి వస్తుంది దీప. ఆటో మీద ఉన్న ‘అమ్మానాన్న ఎక్కడున్నారు’ అనే పదాలను చూస్తుంది. ఇంతలో సౌర్య కాల్ చేయడంతో ఎత్తి మాట్లాడుతుంటాడు ఇంద్రుడు. ఆమె సరుకులు తెమ్మనడంతో రాసుకోవడానికి సిద్ధమైన ఇంద్రుడిని ఆటో నడపమని తను రాస్తానని ఫోన్లో మాట్లాడుతుంది దీప. తల్లి గొంతు గుర్తుపట్టి ఎమోషనల్ అవుతుంది సౌర్య. దీపని అక్కడి నుంచి పంపడానికి మోనిత వేసిన ప్లాన్ ఏంటో.. అసలేం జరిగిందో తెలియాలంటే తర్వాత ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.