యూనివర్శల్ యాక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్న నటుడు అంటే కమల్ హసన్ అని ఎవరైనా యిట్టె చెప్పేస్తారు. ఎలాంటి వేరియేషన్స్ ని అయినా ఈజీగా తెరపై చూపించే సత్తా ఆయన సొంతం అందుకే నటనలో కమల్ హాసన్ ఒక డిక్టనరీగా అభివర్ణిస్తారు. ఆయన చేయని ప్రయోగం లేదు. పోషించని పాత్ర లేదు. నవరసాలలో అన్ని రకాల ఎమోషన్స్ ని పలికించి ముఖంతోనే మెస్మరైజ్ చేసే నటుడుగా కమల్ హసన్ గురించి చెప్పుకోవాలి. ఆ స్థాయిలోకి రీచ్ కావడానికి చాలా మంది నటులు ప్రయత్నం చేస్తున్నారు. అయితే కొంత మంది మాత్రమే సమీపానికి వచ్చారు.
అయితే ఇప్పటికి హీరోగా అతను ఇచ్చే వేరియేషన్స్, స్టైల్ ని ఎవరూ టచ్ చేయలేరనే చెప్పాలి. ఈ విషయాన్ని ఇండియన్ 2 మూవీ విషయంలో కమల్ హసన్ మరోసారి ప్రూవ్ చేశాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చెన్నైలో జరుగుతుంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్ కి సీక్వెల్ గా ఈ మూవీని దర్శకుడు శంకర్ ఆవిష్కరిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ లో భాగంగా ఓ సన్నివేశం చిత్రీకరణ తాజాగా జరిగింది.
ఈ సీన్ లో ఏకదాటిగా 10 నిమిషాల పాటు 14 బాషలలో కమల్ హసన్ డైలాగ్స్ చెప్పాలి. అయితే ఈ సీన్ లో ఎలాంటి కట్ లేకుండా సింగిల్ టేక్ లో కమల్ హసన్ పూర్తి చేసాడని టాక్ నడుస్తుంది. ఇక పది నిమిషాల సన్నివేశం చేయడానికి ఇప్పటి హీరోలు టేక్ ల మీద టేక్ లు తీసుకుంటారు. అలాగే మల్టీపుల్ షాట్స్ తీసి వాటిని కలుపుకోమని సలహా ఇస్తారు. అయితే కమల్ హసన్ మాత్రం సీన్ పెర్ఫెక్షన్ కోసం ఎలాంటి కటింగ్ లేకుండా సింగిల్ టేక్ లో డైలాగ్స్ మొత్తం 14 బాషలలో చెప్పి అందరిని మేస్జరైజ్ చేశాడు. ఇప్పుడు చెన్నై సర్కిల్ లో టాక్ అఫ్ ది ఇండస్టీగా మారిపోయింది.