సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎదగాలని వచ్చే అమ్మాయిలకి లైంగిక వేధింపులు ఎక్కువగా ఉంటాయనేది చాలా మంది చెప్పే మాట. హీరోయిన్ గా సక్సెస్ కావాలన్న, అవకాశాలు రావాలన్న నిర్మాతలు, దర్శకులతో టచ్ లో ఉంటూ వారితో బెడ్ కూడా షేర్ చేసుకోవాలనే విషయాన్ని చాలా మంది హీరోయిన్స్ నేరుగానే తెలియజేశారు. దర్శక, నిర్మాతలకి నచ్చినట్లు ఉంటేనే వారి ప్రోత్సాహంతో సక్సెస్ వస్తుందని, లేదని మడికట్టుకొని కూర్చుంటే అవకాశాలు రాకుండా అడ్డుకుంటారనే అభిప్రాయం ఉంది. అలాగే ఒక సినిమాకి హీరోయిన్ ని ఎంపిక చేసుకున్నప్పుడు కమిట్మెంట్ ఇస్తుందా అనే మాట ఎక్కువగా అడుగుతూ ఉంటారు.
కమిట్మెంట్ తో పాటు ఎంత, కమిట్ మెంట్ లేకుండా రెమ్యునరేషన్ ఎంత అనే విషయాలని కాస్టింగ్ మేనేజర్స్ తోనే నిర్మాతలు, దర్శకులు ముందు మాట్లాడుకొని హీరోయిన్ ని ఎంపిక చేసుకుంటారు. గతంలో ఈ విధానం బాగా ఎక్కువగా ఉండేది. అయితే మీటూ ఉద్యమం ఇంపాక్ట్ తర్వాత ఇండస్ట్రీలో ఈ పరిస్థితి పూర్తిగా మారిందని చెప్పాలి. ఎవరూ కూడా కమిట్మెంట్ ఆధారంగా హీరోయిన్స్ ని ఎంపిక చేయడం లేదు. ఇదే విషయాన్ని బాలీవుడ్ నటి షామా సికందర్ కూడా తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. తనకి ఎదురైన అనుభవాలని కూడా ఆ ఇంటర్వ్యూలో పంచుకుంది.
గతంలో ఆరంభించిన సమయంలో కొంత మంది నిర్మాతలు, దర్శకులు వారితో సినిమా చేయకపోయినా క్లోజ్ గా ఉండాలని చెప్పేవారని చెప్పింది. అలా ఉంటూ వారితో బెడ్ షేర్ చేసుకుంటేనే అవకాశాలు వస్తాయని కూడా నేరుగానే నన్నే అడిగేవారని షామా సికందర్ చెప్పుకొచ్చింది. కమిట్మెంట్ లేకుండా సినిమా అవకాశాలు రావడం కూడా గతంలో కష్టంగా ఉండేదని, దానికి ఒకే అన్నవారికే అవకాశాలు ఎక్కువగా వచ్చేవని చెప్పింది. అయితే ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిందని షామా ఒప్పుకుంది. ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా మార్పులు వచ్చాయని, హీరోయిన్స్ ని ప్రతిభ ఆధారంగా సినిమాకి ఎంపిక చేసుకుంటున్నారని బాలీవుడ్ బ్యూటీ చెప్పుకొచ్చింది.