Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ రెండో వారం కెప్టెన్సీ టాస్క్ కి సంబంధించి హౌస్ లో పోటాపోటీ వాతావరణం చోటుచేసుకుంది. రెండో వారం కెప్టెన్సీ టాస్క్ కి చంటి, సూర్య, సుల్తానా, రాజ్ అర్హత సాధించడం తెలిసిందే. అయితే ఇక్కడ బిగ్ బాస్ ఊహించిన ట్విస్ట్ ఇచ్చారు. రెండో వారం కెప్టెన్ నీ ఇంటి సభ్యులే ఎన్నుకోవాలని తెలియజేశారు. దీంతో కెప్టెన్ పోటీ దారులు ఎవరికి వారు తమకి ఇష్టం వచ్చినట్లు ఇంటి సభ్యుల ఓట్లు కొల్లగొట్టడానికి.. ప్రచారం చేశారు. నలుగురు కూడా అనేక హామీలు ఇంటి సభ్యులకి ఇవ్వడం జరిగింది.
అయితే ఇక్కడ ప్రతి ఇంటి సభ్యుడు ఒకరిగా కాకుండా ఇద్దరు ఇద్దరు కలిసి.. ఒకరికి మాత్రమే కెప్టెన్ అర్హత ఉండేలా ఓటేయాలని బిగ్ బాస్ ఆదేశాలు ఇచ్చారు. దీంతో నలుగురిలో రాజ్ కెప్టెన్ గా ఉండటానికి తమకి ఏమి అభ్యంతరం లేదని రేవంత్- గీతు, షాని -శ్రీహన్ మద్దతు తెలపడంతో మిగతా ముగ్గురి కంటే రాజ్ లీడ్ లో ఉన్నారు. ఈ ప్రక్రియలో చంటికి.. అర్జున్-ఫైమా మద్దతు తెలిపారు. సూర్యకి.. శ్రీ సత్య- వాసంతి మద్దతు తెలపడం జరిగింది. సుల్తానాకి ఎవరు మద్దతు తెలపలేదు. మరి శుక్రవారం సుల్తానాకి.. ఎవరైనా ఓటేస్తారేమో చూడాలి.
మరోపక్క రాజ్ మొదటి వారంలో ఎక్కడ కూడా కనిపించలేదని నాగార్జున గతవారం వీకెండ్ ఎపిసోడ్లో కామెంట్లు చేశారు. కానీ రెండోవారం వచ్చేసరికి హౌస్ మేట్స్ దాదాపు అందరూ రాజ్ చాలా మంచివాడని డిస్కషన్ చేసుకుంటూ ఉన్నారు. అంతే కాదు ఈవారం ఎలిమినేషన్ లో రాజ్ ఉండటంతో కెప్టెన్ అయితే.. అతనికి బాగుంటుందని ఇంటి సభ్యులే ఎక్కువ డిస్కషన్ చేసుకుంటూ ఉన్నారు. సో దీన్ని బట్టి చూస్తే రాజ్ రెండో వారం కెప్టెన్ రావడానికి.. చాలా అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.