Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ 6 రెండో వారం కెప్టెన్సీ పోటీదారులలో చంటి ఒకరు. మొత్తం నలుగురు రెండో వారం కెప్టెన్ కావటానికి పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో గురువారం ఎపిసోడ్ లో “నాచో..నాచో” అనే టాస్క్ ఆడటం జరిగింది. ఈ టాస్క్ లో భాగంగా కెప్టెన్సీ పోటీ దారులు… ప్రచారం చేసుకున్నారు. ఈ సందర్భంగా చంటి ఇంటి సభ్యులకు పలు హామీలు ఇచ్చారు. రాత్రి ఏదైనా చేసి పెడతానని అన్నారు. కిచెన్ లో దొంగతనం జరగకుండా చూసుకుంటా. అవసరమైతే దొంగలను పట్టుకుంటా అని పేర్కొన్నారు. న్యాయం మీద నిలబడతా న్యాయం కోసం పోరాడుతా ఇదే నా నినాదం. అవసరమైతే బిగ్ బాస్ మీద కూడా ఫైట్ చేస్తా. నేనేంటో మీకు తెలుసు.
బెల్ మోగిన అరగంట వరకు మిమ్మల్ని ఎవరిని డిస్టర్బ్ చేయను పడుకోనిస్తాను.. అంటూ చంటి పలు హామీలు ఇంటి సభ్యులకు ఇచ్చాడు. అయితే గురువారం ఎపిసోడ్ లో ఫైమా- అర్జున్ మాత్రమే చంటికి మద్దతు తెలపడం జరిగింది. మరి శుక్రవారం ఎవరైనా మద్దతు తెలుపుతారు ఏమో చూడాలి. దాదాపు నాలుగు జంటలు ఓటింగ్ లో పాల్గొన్నాయి. ఒక జంట మాత్రమే చంటికి మద్దతు తెలపడం జరిగింది.
ఇదిలా ఉంటే గురువారం డిస్కషన్ సమయంలో చాలామందికి ప్రాధాన్యత ఎక్కువ ఇచ్చారు. కానీ ఎపిసోడ్ చివరిలో చంటి, సూర్య, సుల్తానా… తమకి కెప్టెన్ పదవి వద్దులే నువ్వు తీసుకో అని అన్నారు. అది సీరియస్ గా అన్నారో…. లేకపోతే జోక్ గా అన్నారో ఎవరికి అర్థం కావడం లేదు. అయితే రాత్రి అయిన నేపథ్యంలో బిగ్ బాస్.. కెప్టెన్సీ పోటీదారులు కెప్టెన్ కావడానికి.. ఇంటి సభ్యుల మద్దతు కూడుకట్టుకోవాలని తెలియజేయడం జరిగింది.