Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ రెండో వారం ఇంటి నుండి ఎలిమినేట్ కావడానికి 8 మంది నామినేట్ కావడం తెలిసిందే. 8 మందిలో రేవంత్, ఫైమా, గీతూ రాయల్, మెరీనా రోహిత్, ఆదిరెడ్డి భారీగా ఓట్లు రాబడుతున్నారు. మిగతా ముగ్గురు షాని, రాజశేఖర్, అభినయశ్రీ కి ఒకే తరహా ఓటింగ్ గ్రాఫ్ ఉంది. ఇదిలా ఉంటే రెండో వారం కెప్టెన్సీ బరిలో రాజ్ ఉండటం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే హౌస్ నుండి రాజ్ ఓటింగ్ ప్రక్రియలో ముందంజలో ఉన్నారు. పైగా ఎపిసోడ్ చివరికి వచ్చే టైం లో మిగతా ముగ్గురు కెప్టెన్ పోటిదారులు చంటి, సూర్య, సుల్తానా.. రాజ్ రెండో వారం కెప్టెన్ కావడానికి తమకేమీ అభ్యంతరం లేదని తెలియజేశారు.
దీంతో ఒకవేళ రాజ్ కెప్టెన్ అయితే మాత్రం హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు లేవని బయట టాక్. రాజ్ కెప్టెన్ అయితే షానీ వెళ్లిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని అంటున్నారు. ఎందుకంటే రెండో వారం అస్సలు షానీకి పెద్దగా ఫుటేజ్ కూడా లేదు. మనోడు ఆడిన ఆట కూడా పెద్దగా ఏమీ లేదు. సో కచ్చితంగా షానీ ఇంటి నుండి బయటకు వెళ్లిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అని బయట ప్రచారం జరుగుతుంది.
ఇక గేమ్ పరంగా మొదటి వారంతో పోలిస్తే రెండోవారానికి రాజ్ బాగా పుంజుకోవడం జరిగింది. ఫిజికల్ టాస్కులు పరంగా ఇంకా ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియలో కూడా వాయిస్ పెంచాడు. దాదాపు రెండో వారం హౌస్ లో చాలామంది చేత మంచివాడు అనిపించుకున్నాడు. సో రాజ్ కెప్టెన్ అయితే మాత్రం… ఈవారం సేవ్ అయిపోతాడని ప్రచారం జరుగుతుంది.