Bigg Boss Season 6 Day 12 Episode Review: బిగ్ బాస్ సీజన్ సిక్స్ 12వ రోజు ఎపిసోడ్ మొదటిలో ఎమోషనల్ గా చివరిలో ఉత్కంఠ భరితంగా సాగింది. కెప్టెన్సీ పోటీదారులుగా బుధవారం ఎపిసోడ్ లో చంటి, సూర్య, సుల్తానా, రాజ్ అర్హత సాధించడం తెలిసిందే. అయితే గురువారం ఎపిసోడ్ స్టార్టింగ్ లో.. బేబీతో ఇంటి సభ్యులు బాగా కనెక్ట్ కావడంతో జీవితంలో ఒక బేబీ ఉండటం ఆమె మీ జీవితాన్ని ఎలా మారుస్తుందో అనే విషయాన్ని తెలియజేయాలని బిగ్ బాస్ కోరారు. ఈ సందర్భంగా స్టార్టింగ్ ఆదిరెడ్డి తన కూతురు..కి సంబంధించి విషాద సంఘటన తెలియజేశారు. అనంతరం సుదీప థైరాయిడ్ కారణంగా.. గర్భం పోయిన విషయాన్ని తెలియజేసింది. అదే సమయంలో తన చెల్లి కూతురు తన దగ్గర నుండి తీసుకున్న టైములో చాలా ఎమోషనల్ అయినట్లు పేర్కొంది.
ఆ తర్వాత రేవంత్ వచ్చి ప్రస్తుతం తన వైఫ్ కి ఏడవ నెల. బేబీ గేమ్ ఆడుతున్న సమయంలో చాలా ఫీల్ అయ్యాను. “నాన్న” అనే పదం పిలిపించుకోవడానికి ఎంతో ఆతృతగా ఉన్నాను అని తెలియజేశారు. అనంతరం కీర్తి వచ్చి తన విషాద గాధ తెలియజేసింది. 2017వ సంవత్సరంలో ఓ ప్రమాదంలో కుటుంబ సభ్యులందరినీ పోగొట్టుకోవడం జరిగిందని పేర్కొంది. అయితే ఆ సమయంలో దాదాపు 32 రోజులపాటు కోమాలోకి వెళ్లిపోవడం జరిగింది. ఆ తరువాత హాస్పిటల్ లో కోలుకున్నాక కళ్ళు తెరిచి చూస్తూ నన్ను ఎవరైనా కేర్ తీసుకుంటారేమో అని ఎదురు చూశాను. ఎవరూ లేరు. ఆ సమయంలో ఎంతగానో గుక్క పెట్టి ఏడిచాను. హాస్పిటల్ నుండి బయటకు వచ్చాక కొద్ది డబ్బులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆ సమయంలో ఎంతో ఆకలేసింది చివరాఖరికి కుక్కకు పెట్టే బ్రెడ్ తినాల్సి వచ్చింది. అయితే జీవితంలో ఎన్ని దెబ్బలు తిన్నా గానీ బతకాలని అనిపించడానికి ప్రధాన కారణం.. దత్తత తీసుకున్న పాపా అని తెలిపింది. ఆ పాప వచ్చాక జీవితంలో అనేక విషయాలు జరిగాయని కీర్తి తెలిపింది.

అయితే ఆ పాపకి శ్వాసకి సంబంధించి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. అంతకుముందు చూపించడం జరిగింది. కానీ బిగ్ బాస్ కి వచ్చేముందు అనారోగ్యం కారణంగా హాస్పిటల్ లో జాయిన్ చేయడం జరిగింది. ఆ తర్వాత నేను ఈ షోకి వచ్చాను. అయితే రేపు క్వరెంటైన్ కి వెళ్లే సమయానికి పాప మరణించడం జరిగింది. నా జీవితంలో ఇది చాలా విషాద సంఘటన. ఆ పాపని పెంచుకుంటామని చాలా మంది అప్పట్లో అన్నారు. ఒకవేళ నా దగ్గర కాకపోతే వాళ్ళ దగ్గర ఉండి ఉంటే… పాప ఆరోగ్యం బాగుండేదేమో..బతికిఉండేదేమో అనే గిల్టీ ఫీలింగ్ ఇప్పటికీ నన్ను వెంటాడుతూనే ఉంది. ఒకవేళ పెళ్లి తర్వాత పిల్లలు వస్తారు అని అనుకోవాలనుకున్న.. ప్రమాదం జరిగిన సమయంలో నా గర్భసంచి తీసేశారు. మళ్లీ బయటికి వెళ్లాక వేరే పాపని దత్తత తీసుకుంటాను అని కీర్తి తన కన్నీటి గాథని తెలియజేసింది. తర్వాత వంతు చంటి కి వచ్చింది. కళ్ళముందే అగ్నిప్రమాదంలో తల్లి చనిపోయినట్లు తెలియజేశాడు. తరువాత తన భార్య ప్రెగ్నెంట్ అయ్యి ఇద్దరు ఆడపిల్లలకి జన్మనిచ్చిందని అప్పుడు ఎంతగానో ఏడ్చాను. కానీ తన తల్లినీ ఇద్దరిగా భగవంతుడు పంపించినట్లు చంటి ఎమోషనల్ అయ్యారు. ఆ తర్వాత రోహిత్ మేరీనా.. తమకి పుట్టిన బేబీ గురించి తెలియజేసి.. గుండె సంబంధిత వ్యాధి కారణంగా చనిపోయినట్లు తెలిపారు. శ్రీ సత్య.. కూడా చాలా ఎమోషనల్ గా మాట్లాడింది. ఇప్పుడు నా పిల్లలు ఎలా ఉండాలి అనేది నేను చెప్పడం లేదు. ఇప్పుడు ఉండే పిల్లలనీ ఎలా చూసుకోవాలో మీకు చెబుతున్నాను.
ఇప్పుడు మీకు ఏమైనా చెబితే చిరాకు ఉండొచ్చేమో. తిను అన్న చిరాకు వస్తది. కానీ ఒకానొక సందర్భంలో అది వారు చెప్పకపోయినా గానీ చిరాకు వస్తది. మొదటిగా నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే మనల్ని అర్థం చేసుకోవాలి తల్లిదండ్రులు, మనకి నచ్చినట్టు వాళ్ళు ఉండాలి కాకుండా.. వాళ్ళు ఎందుకు చెబుతున్నారో మనం ఆలోచించాలి అని శ్రీ సత్య తెలిపింది. వాళ్ళు ఏది చెబుతున్నా పాజిటివ్ గా తీసుకోవాలని సూచించింది. ఆ తర్వాత మొత్తం హౌస్ అంతా ఎమోషనల్ వాతావరణంతో నిండిపోయింది. తర్వాత రోజు ఉదయం రేవంత్ కి ఇంకా అర్జున్ మధ్య కొద్దిగా సీరియస్ డిస్కషన్ జరిగింది.
అనంతరం రెండో కెప్టెన్సీ టాస్క్ గా “నాచు నాచు” నిర్వహించారు. ఈ టాస్క్ లో భాగంగా కెప్టెన్సీ పోటీదారులు రకరకాల డ్రస్సులతో డిజె టిల్లు మాదిరిగా దుస్తులు ధరించుకోవాలని బిగ్ బాస్ ఆదేశాలు ఇచ్చారు. అనంతరం సాంగ్స్ కి ఇంటి సభ్యుల డ్యాన్సులు వెయ్యాలని, సాంగు అయిపోయాక ఇద్దరు ఇద్దరుగా వచ్చి నచ్చిన కెప్టెన్ దారుడికి మద్దతు తెలపాలని రూల్. ఈ సమయంలో కెప్టెన్ పోటీదారులు ఇంటి సభ్యులకు పలు హామీలు ఇస్తూ ప్రచారం చేసుకున్నారు. ఆ తర్వాత సాంగ్ అయిపోయిన తర్వాత స్టార్టింగ్ లో గీతు, రేవంత్ వచ్చి రాజ్ కి ఓటు వేయడం జరిగింది. ఆ తర్వాత శ్రీ సత్య- వాసంతి.. సూర్యకి మద్దతు తెలిపారు. ఇంకా పైమా .. అర్జున్ ఇద్దరు చంటికి జై కొట్టారు. ఎపిసోడ్ అయిపోతుంది అన్న టైంలో షాని- శ్రీహాన్.. రాజ్ కి ఓటు వేయడం జరిగింది. ఆట ముగిసే సమయానికి రాజ్ కి రెండు ఓట్లు సూర్య, చంటికి చెరో ఓటు వచ్చింది. ఇదిలా ఉంటే ఎపిసోడ్ చివరిలో రాజ్ కెప్టెన్ కావడానికి తమకేం అభ్యంతరం లేదని.. సూర్య, సుల్తానా, చంటి తెలియజేయడం సంచలనంగా మారింది. వాళ్ళు సీరియస్ గా అన్నారో..? జోక్ గా చెప్పారో..? ఎవరికి అర్థం కావటం లేదు. సీరియస్ గా చెబితే మాత్రం రెండో వారం కెప్టెన్ గా రాజ్ ఎన్నికైనట్టే.