Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ కి సంబంధించి ప్రస్తుతం హౌస్ లో రెండో వారం కెప్టెన్సీ ఎన్నిక జరుగుతుంది. కెప్టెన్సీ పోటీదారులుగా చంటి, రాజ్, సూర్య, సుల్తానా అర్హత సాధించటం తెలిసిందే. అయితే రెండో వారం కెప్టెన్ ఎన్నిక పూర్తిగా ఇంటి సభ్యులకు బిగ్ బాస్ ఇచ్చేయడం జరిగింది. ఈ క్రమంలో డీజే టిల్లు టాస్క్ నిర్వహించారు. ఇంటి సభ్యులంతా సాంగ్స్ వేస్తూ ఉండగా పక్కన సౌండ్ బాక్స్ స్ వద్ద డీజే టిల్లు పాత్రలో రకరకాల వేషధారణతో నలుగురు కెప్టెన్సీ పోటీదారులు పోటీబడటం జరిగింది.
సాంగ్ అయిపోయిన వెంటనే కెప్టెన్సీ పోటీ దారులు.. కెప్టెన్ కావటానికి ప్రచారం నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఎవరికి వారు తమ హామీలు ఇవ్వడం జరిగింది. అయితే ఇద్దరు ఇద్దరు ఇంటి సభ్యులను.. పిలిచి కెప్టెన్ గా ఒకరికి మాత్రమే ఓటు వేయాలని బిగ్ బాస్ రూల్. రెండో వారం కెప్టెన్సీ ఎంపికకు సంబంధించి “డీజే” టిల్లు టాస్క్ రసవత్తరంగా సాగింది.

ఇంటి సభ్యులు తాము ఎందుకు కెప్టెన్ గా ఓటు వేస్తున్నామో చెప్పే సంభాషణ ఆటలో చాలా కీలకంగా మారింది. చాలావరకు హౌస్ మేట్స్ చంటికి ఇంకా సూర్యకి ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నారు. వాళ్ళిద్దరిలో ఒకరు కెప్టెన్ అయితే బాగుంటుందని అంటున్నారు. రాజ్ లో అంత కమాండింగ్ లేదని చెబుతున్నారు. మరికొద్ది గంటల్లో ప్రసారం కాబోయే ఎపిసోడ్ లో “డీజే” టిల్లు టాస్క్ లో ఇంటి సభ్యులు ఒకపక్క ఎంటర్టైన్మెంట్ అందిస్తూనే మరోపక్క కెప్టెన్ ఎన్నిక విషయంలో తమ వాదనలు వినిపించారు.