Biggboss 6 : బిగ్‌బాస్ సీజన్ 6 రెండోవారం కూడా పూర్తి కావడానికి వస్తోంది. ఇవాళ ఎవరు కెప్టెన్ అవుతారో తేలాల్సి ఉంది. ఇప్పటికే కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ పూర్తైంది. దీనిలో భాగంగా ఇంటి సభ్యులకు ఇచ్చిన సిసింద్రీ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. బేబీ బాగోగులు చూస్తూ సమయానుసారం బిగ్‌బాస్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఇంటిసభ్యులు చేసిన యాక్టివిటీ వినోదాన్ని పంచింది. అయితే ఈరోజు టెలికాస్ట్ కాబోయే ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమోను తాజాగా స్టార్ మా రిలీజ్ చేసింది. ఈ ఎపిసోడ్ మాత్రం చాలా ఎమోషనల్‌గా ఉండబోతుందని ప్రోమోను బట్టి అర్థమవుతుంది.
ఇందులో బేబీస్‌తో రెండు రోజుల పాటు గడిపిన కారణంగా వాటితో ఏర్పరుచుకున్న అనుబంధాన్ని గమినించినట్టు బిగ్‌బాస్ కంటెస్టెంట్స్‌కు తెలిపారు. ఇంటి సభ్యులు తమ జీవితంలో ఒక బేబీని ఉండటం, అది వారి జీవితాన్ని ఎలా మార్చింది అన్నది ఈ ప్రక్రియ ద్వారా పంచుకోవాలని ఆదేశించాడు. ఇందులో భాగంగా ఒక్కో ఇంటిసభ్యుడు తమ విషాద గాథను చెప్పి కంటతడి పెట్టించారు. 2015లో ప్రెగ్నెంట్ అని తెలిసిందనీ, కానీ థైరాయిడ్ ఎక్కువగా ఉండటంతో బేబీని కోల్పోయానంటూ సుదీప ఎమోషనల్ అయ్యింది. తన చెల్లి కూతురిలో తన బిడ్డను చూసుకున్నానని, కానీ ఆ పాపను తిరిగి ఇచ్చేస్తున్నప్పుడు ప్రాణం పోయినంత పని అయిందని చెప్పింది.
Biggboss 6 : చిన్నప్పుడే నాన్న పోయారంటూ రేవంత్ ఎమోషనల్..
రేవంత్ మాట్లాడుతూ.. ప్రస్తుతం తన భార్య 7వ నెల ప్రెగ్నెంట్ అని చెప్పాడు. చిన్నప్పటి నుంచి నాన్న అనే పిలుపునకు తాను నోచుకోలేదని వెల్లడించాడు. దీంతో ఎప్పుడెప్పుడు నాన్న అని పిలిపించుకోవాలా అని ఆత్రంగా ఉందని తెలిపాడు. ఇక బిగ్‌బాస్ ఇంటికి వచ్చేముందే తన కూతుర్ని పోగోట్టుకున్నానని చెబుతూ కీర్తి భట్ ఎమోషనల్ అయ్యింది. చివరి నిమిషంలో కూడా తన కూతురితో ఉండలేకపోయినందుకు బాధగా ఉందని చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంది. ఇక బిగ్‌బాస్ క్యూట్ కపుల్ మెరీనా అండ్ రోహిత్‌లు మాట్లాడుతూ.. మూడోనెల దాటాక బేబీ హార్ట్‌బీట్ లేదని చెప్పారు. వేరే ఆప్షన్ లేక బేబీని తీసేయాల్సి వచ్చింది అని చెబుతూ ఎమోషనల్ అయ్యారు. ఇక చలాకీ చంటీ మాట్లాడుతూ.. తనకళ్ల ముందే ఫైర్ యాక్సిడెంట్ అయిందని, తాను చూస్తుండగానే అమ్మ కాలిపోయిందని చెప్పడం అందరినీ కంటతడి పెట్టించింది. ఇది చూస్తుంటే నవ్వుతూ నవ్విస్తూ ఉంటే చంటి జీవితంలో ఇంత విషాదం ఉందా? అని అనిపించక మానదు.