Priyanka Mohan: తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ ప్రియాంక మోహన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ హీరో నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది ప్రియాంక మోహన్. ఆ తర్వాత శర్వానంద్ తో కలిసి శ్రీకారం సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ రెండు సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగానే చేరువయ్యింది.
నటనతో పాటు అందం కూడా ఉన్నప్పటికీ అవకాశాలను అందుకోవడంలో ఈమె ఫెయిల్ అయ్యింది. ఈ రెండు సినిమాల ద్వారా ఈమెకు మంచి గుర్తింపు వచ్చినప్పటికీ ఈమెకు అవకాశాలు రాలేదు. ఇక శ్రీకారం సినిమా తర్వాత ఈ మధ్యకాలంలో మళ్లీ ఏ సినిమాలో కూడా నటించలేదు ప్రియాంక మోహన్.
తెలుగులో నటించకపోయినప్పటికీ తమిళంలో మాత్రం మంచి మంచి అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతోంది. మొదట కన్నడ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ తెలుగులోకి కూడా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది. ఇక తమిళంలో నటించిన డాక్టర్ సినిమా తనకు ఊహించిన విధంగా మంచి సక్సెస్ ను తెచ్చి పెట్టింది.
కాగా ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ అవకాశాలు లేక ఖాళీగా గడుపుతోంది. నటించకపోయినప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు అభిమానులతో చిట్ చాట్ నిర్వహిస్తోంది. ఇక సోషల్ మీడియాలో అప్పుడప్పుడు హాట్ ఫోటో షూట్లతో యువతకు పిచ్చెక్కిస్తోంది.
ఇది ఇలా ఉంటే తాజాగా ప్రియాంక సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది.
ఆ ఫోటోలలో ఆమె పద్ధతిగా డ్రెస్ వేసుకొని కనిపించినప్పటికీ తన చూపులతో తన వైపుకు తిప్పుకుంటోంది. కాగా ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.