Biggboss 6 : బిగ్ బాస్ ఇంట్లో సెకండ్ వీక్ కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ బుధవారంతో ముగిసింది. సిసింద్రీ అంటూ బిగ్ బాస్ ఇంట్లోకి బొమ్మలను పంపించాడు. ఒక్కో కంటెస్టెంట్‌కు ఒక్కో బొమ్మను ఇచ్చాడు. దాన్ని కాపాడుకునే బాధ్యతను కూడా ఇచ్చాడు. ఎవరి బొమ్మలైతే లాస్ట్ అండ్ ఫౌండ్ ఏరియాలో పడతాయో.. వారు ఆట నుంచి అవుట్ అయిపోతారు. ఇక ఇక్కడే ఊహించని ట్విస్ట్‌లు చోటు చేసుకున్నాయి. బుర్రలకు పదును పెట్టి మరీ ఎదుటి వాడిని ఓడించడమే లక్ష్యంగా కొందరు ఆడితే.. మరికొందరు సీరియస్‌గా ఆడారు. కొందరైతే లైట్ తీసుకున్నారు. నిన్న జరిగిన ఆటలో రేవంత్ బొమ్మను, సత్య, అభినయలకు సంబంధించిన బొమ్మలను లాస్ట్ అండ్ ఫౌండ్ ఏరియాలో గీతూ పడేసింది.
ఇక రెండో చాలెంజ్ కోసం అర్జున్, ఫైమా, కీర్తి, ఇనయ ఇలా అందరూ పోటీ పడ్డారు. రింగ్‌లో నిలబడిన వాడే కింగ్ అనే ఈ టాస్క్‌కు రేవంత్ సంచాలకుడిగా వ్యవహరించాడు. సంచాలక్‌గా రేవంత్ పర్ఫెక్ట్‌గా వ్యవహరించాడు. సరైన నిర్ణయాలు తీసుకుంటూ గేమ్ ఆడించాడు. ఈ టాస్క్ పేరు.. రింగ్‌లో నిలబడ్డ వాడే కింగ్. దీనిలో ఫైమా ఘోరాతి ఘోరంగా ఓడిపోయింది. వాళ్లకు ఇచ్చిన షీల్డులతోనే వేరొక కంటెస్టెంట్‌ను తోసేయాల్సి ఉంటుంది. కానీ ఫైమా మాత్రం తన బాడీని ఉపయోగించి తోసేసింది. దీంతో సంచాలక్‌గా ఉన్న రేవంత్ ఆమెను తీసి పక్కన పెట్టేశాడు. మరోవైపు ఫైమా బొమ్మను అభినయ లాస్ట్ అండ్ ఫౌండ్ ఏరియాలో పడేసింది. దీంతో ఫైమా గేమ్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.
Biggboss 6 : బొమ్మ పోయినా తగ్గని గీతూ..
ఇక అందరిని దెబ్బ కొడుతున్న గీతూని దెబ్బకొట్టేందుకు అవకాశం కోసం అంతా వేచి చూశారు. ముఖ్యంగా రేవంత్.. గీతూ తన బొమ్మను తెలివిగా స్టోర్ రూంలో దాచి పెట్టేసుకుంది. కానీ రేవంత్ మాత్రం ఎలాగోలా పసిగట్టేశాడు. గీతూ బొమ్మని కూడా లాస్ట్ అండ్ ఫౌండ్ ఏరియాలో పడేశాడు. దీంతో గీతూ కూడా ఆట నుంచి తప్పించుకున్నట్టు అయింది. అయితే గీతూ మాత్రం బాలాదిత్య బొమ్మను కొట్టేసి.. తన బొమ్మ డ్రెస్సును దానికి తగిలించింది. ఈ ఆటను బిగ్ బాస్ అంగీకరిస్తాడా? లేదా? అన్నది చూడాలి. మొత్తానికి గీతూ మాత్రం తన బొమ్మ పోయినా తగ్గలేదు. కానీ ఏదో రకంగా మాత్రం గేమ్‌లో కొనసాగాలని చూస్తోంది. ఈ క్రమంలో నెక్ట్స్ వీక్ జరగబోయే నామినేషన్స్‌లో ఎంత మంది చేతిలో బలవుతుందో ఏమో వేచి చూడాలి.