AP Assembly : ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేటి ఉదయం ప్రారంభమయ్యాయి. ప్రారంభం అయ్యీ అవగానే సభలో గందరగోళం నెలకొంది. అసెంబ్లీ ప్రారంభమవగానే టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. స్పీకర్ పోడియం దగ్గర టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. వాయిదా తీర్మానాలపై చర్చకు టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. జాబ్ ఎక్కడ జగన్ అంటూ టీడీపీ సభ్యుల ప్లకార్డులతో గొడవ చేశారు. నిరుద్యోగులను మోసం చేసిన జగన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. నిరుద్యోగం, జాబ్ లెస్ క్యాలెండర్‌పై సభలో చర్చించాలని టీడీపీ పట్టుబట్టింది. జాబ్ క్యాలెండర్.. జాబ్ లెస్ క్యాలెండర్‌గా మారిందని టీడీపీ నినాదాలు చేసింది.
టీడీపీ సభ్యుల ఆందోళనల మధ్యే ప్రశ్నోత్తరాలు కొనసాగాయి. దీంతో స్పీకర్ పోడియం దగ్గరకు వెళ్లి మరీ టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. వాయిదా తీర్మానాలపై చర్చకు టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. టీడీపీ సభ్యుల తీరుపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు. ప్రశ్నోత్తరాల్లో టీడీపీ సభ్యుల ప్రశ్నలే ఉన్నాయని బుగ్గన పేర్కొన్నారు. ప్లకార్డులతో సభలోకి రావడం సరికాదన్నారు. టీడీపీ సభ్యులు కావాలనే ఆందోళన చేస్తున్నారని బుగ్గన విమర్శించారు. టీడీపీ ఆందోళన మరింత పెరగడంతో ఏపీ అసెంబ్లీ 10 నిమిషాల పాటు వాయిదా పడింది. సభను స్పీకర్ వాయిదా వేశారు.
AP Assembly : బాల వీరాంజనేయస్వామిపై మంత్రి తీవ్ర వ్యాఖ్యలు..
ప్రశ్నోత్తరాల సమయంలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది. స్టడీ సర్కిల్ విషయంలో.. మంత్రి మెరుగ నాగార్జున సమాధానం చెపుతున్నప్పుడు టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో మంత్రి నాగార్జున తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ఎమ్మెల్యే బాల వీరాంజనేయస్వామిపై మంత్రి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నువ్వు దళితుడివైతే, దళితులకు పుడితే.. టీడీపీ అధినేత చంద్రబాబు బంధనాల నుంచి బయటకు రావాలంటూ మంత్రి నాగార్జున సూచించారు. మొత్తానికి ఏపీ అసెంబ్లీ ఆరంభమవగానే పెద్ద ఎత్తున దుమారం రేగింది.