Fun bucket actress : సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఏ రేంజ్ లో ఉందో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న తరహా నటిమణుల నుంచి బిగ్ స్క్రీన్ స్టార్స్ హీరోయిన్స్ వరకు ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. గతంలో ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఫన్ బకెట్ భార్గవి కూడా ఇలాంటి చేదు అనుభవం ఎదురైందని అక్కడి పరిస్థితులను చెప్పడం జరిగింది. చిన్న అవకాశం వస్తే చాలు తమ టాలెంట్ నిరూపించుకోవచ్చు అనుకుంటారు యువ నటీనటులు.
కానీ కొందరి కామ ఆలోచనల కారణంగా ఎంతో మంచి భవిష్యత్తు ఉన్న యాక్టర్స్ భయపడి వెనక్కి వెళ్ళిపోతున్నారు. క్యాస్టింగ్ కౌచ్ అనేది ఇండస్ట్రీలో ప్రతి మూలలో ఉందని భావించిన అమ్మాయిల తల్లిదండ్రులు ఆడపిల్లలను ఇండస్ట్రీకి పంపించడానికి చాలావరకు ధైర్యం చేయడం లేదు. భార్గవి తను ఎదుర్కొన్న పరిస్థితి ఏంటంటే సినిమాలలో హీరోయిన్ గా అవకాశాల కోసం ప్రయత్నిస్తుండగా ఓ నిర్మాత తనను ఆఫీస్ కు రమ్మని పిలిచాడట.
అక్కడికి వెళ్లాక ఒక రూమ్ లోకి పిలిచాడట. ఒక బాయ్ కూల్ డ్రింక్ ఇచ్చి డోర్ లాక్ చేసి వెళ్ళాడట. ఆ నిర్మాత ఒంటరిగా ఉండడంతో ఏం చేయాలో ఏం మాట్లాడాలో తనకు అర్థం కాలేదట. కొంత సేపటి తర్వాత ఆ నిర్మాత షూటింగ్ అవుట్ డోర్ లో ఉంటుంది. మరి నా పరిస్థితి ఏంటి? ఏమైనా ఉందా లేదా? అన్నాడట. ఇక తాను ఏమాత్రం కౌంటర్ ఇయ్యకుండా వీలైనంత తొందరలో అక్కడి నుండి బయటపడాలి అని అనుకుందట.
Fun bucket actress : రెండు మూడు సార్లు ఇటువంటి ఘటనలు ఎదురయ్యాయంటున్న భార్గవి..
ఇంతలో కూల్ డ్రింక్ తాగమంటే అందులో ఏదో తెల్లగా పొడి కలిపినట్లు అనిపించి వద్దని చెప్పి, తన తల్లి ఫోన్ చేస్తుందని.. మీతో తర్వాత మాట్లాడతానని చెప్పి సైలెంట్ గా లేచి బయటకు వచ్చేసిందట. ఇలాంటి పరిస్థితులు తన జీవితంలో రెండు మూడు సార్లు ఎదురయ్యాయని.. వారు చెప్పిన కమిట్మెంట్ కు తాను ఒప్పుకోలేదని.. కానీ ఆ నిర్మాత చేసిన పనికి చాలా భయపడిపోయానని.. ఇండస్ట్రీలో అందరూ అలా ఉంటారని అనడం లేదంటూ.. దాదాపు సగానికి పైగా ఇలాంటి వారే ఉన్నారని తెలిపింది భార్గవి.