పవిత్ర లోకేష్… టాలీవుడ్ ఈ పేరుకి పరిచయం అక్కరలేదు. తెలుగులో హీరో, హీరోయిన్స్ కి తల్లి పాత్రలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని ఈ నటి సొంతం చేసుకుంది. కన్నడంలో హీరోయిన్ గా చేసిన ఈమె ఆశించిన స్థాయిలో సక్సెస్ లు అందుకోలేదు. తరువాత పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యింది. పిల్లలు పుట్టాక సెకండ్ ఇన్నింగ్ మొదలు పెట్టి ప్రస్థానం సినిమాతో తల్లి పాత్రలతో తెలుగులో అడుగుపెట్టింది. ఆ తరువాత వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా వరుస సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అమ్మతనం ఉట్టిపడే పాత్రలతో చక్కని చీరకట్టులో పవిత్ర లోకేష్ ని చూస్తే ఎవరికైనా మంచి అభిప్రాయం కలుగుతుంది. ఆమె లుక్, ఆహార్యం బయట కూడా అలాగే ఉంటుంది. అందుకే పవిత్ర లోకేష్ అంటే మొన్నటి వరకు తెలుగు ప్రేక్షకులకి ప్రత్యేకమైన అభిమానంఉండేది.
అందానికి సంప్రదాయం కలబోసినట్లు ఉండే ఆమెకి అభిమానులు కూడా బాగానే ఉన్నారు. అయితే ఒకే ఒక్క ఇష్యూ టాలీవుడ్ లో ఆమె ఇమేజ్ ని పూర్తిగా మార్చేసింది. సీనియర్ నటుడు లోకేష్ తో ప్రేమాయణం ఆమె కొంపముంచింది. మైసూర్ లో నరేష్ భార్యకి ఓ హోటల్ లో రెండ్ హ్యాండ్ గా దొరిపోయారు. ఆ సమయంలో మీడియా కళ్ళు అన్ని వారిద్దరిపైనే ఉన్నాయి. అయితే అంతకు కొద్ది రోజుల ముందే వారు మీడియా ముందుకి వచ్చి తామిద్దరి మధ్య అందరూ అనుకునేలాంటి సంబంధం లేదని. మంచి స్నేహితులమని చెప్పే ప్రయత్నం చేశారు. అయితే వారి బండారం మైసూర్ లో మీడియాకి అడ్డంగా బయటపడింది. తరువాత పవిత్ర లోకేష్ భర్త కూడా ఆమె గురించి కొన్ని కామెంట్స్ చేశారు.
తనతో ఇంకా పవిత్రకి విడాకులు కూడా కాలేదని చెప్పుకొచ్చాడు. ఇక ఈ వ్యవహారంలో నరేష్ తరువాత మెల్లగా సైడ్ కావడంతో పాటు ఇండస్ట్రీ పలుకుబడి ఉండటంతో బయట పడ్డాడు. అదే సమయంలో పవిత్రని కూడా వదిలించుకున్నట్లు వినికిడి. అయితే నరేష్ ని నమ్ముకొని తన ఆమె తన ఇమేజ్ ని డ్యామేజ్ చేసుకోవడంతో పాటు టాలీవుడ్ లో అవకాశాలని కూడా కోల్పోయినట్లు తెలుస్తుంది. కొన్ని సినిమాలలో తల్లి పాత్రల కోసం ఆమెని తీసుకున్న ఈ వ్యవహారంతో సినిమాపై నెగిటివిటీ క్రియేట్ అవుతుందని పక్కన పెట్టినట్లు బోగట్టా. ఇలా పద్దతిగా గుర్తింపు తెచ్చుకొని బజారు కెక్కి అవకాశాలు పోగొట్టుకోవడంతో పవిత్రకి ఇప్పుడు జ్ఞానోదయం అయ్యిందనే మాట వినిపిస్తుంది.