Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ స్టార్ట్ అయిన నాటి నుండి గీతూ రాయల్ మంచి దూకుడుగా ఆడుతున్న సంగతి తెలిసిందే. తన స్ట్రాటజీలతో ఇంటి సభ్యులకు చుక్కలు చూపిస్తూ ఉంది. హౌస్ లో ఎంట్రీ ఇచ్చిన నాటి నుండి.. ఏదో ఒక పని చేస్తూ ఎక్కువ స్క్రీన్ స్పేస్ తనని కవర్ అయ్యేలా చేసుకోవడంలో సక్సెస్ సాధించింది. మొదట్లో గీతు రాయల్ పై నెగిటివిటీ ఉన్న రెండో వారంలో ప్రేక్షకులలో ఉన్న కొద్దిగా ఆదరణ పెరుగుతూ ఉంది. ముఖ్యంగా రెండవ వారం కెప్టెన్సీ పోటీదారుల “సిసింద్రీ టాస్క్” లో గీతు ఆడిన ఆట వల్లే హౌస్ లో పోటీ వాతావరణం నెలకొందని జనాలంటున్నారు.
మిగతా కంటెస్టెంట్లు అసలు హౌస్ లో గేమ్ ఆడటానికి వచ్చారో..? తింటాకి పడుకోవడానికి వచ్చారో అర్థం కావడం లేదు అని విమర్శలు చేస్తున్నారు. ఈ సీజన్ లో హౌస్ లో ఉన్న సభ్యులు ఎవరు కూడా గేమ్ ఆడాటనికి ముందుకు రాకుండా .. ఎక్కడికక్కడ కాంప్రమైజ్ లు అవుతూ సేఫ్ గేమ్ ఆడుతున్నారు. చాలా కరెక్ట్ గేమ్ గీతు ఆడుతుందని ప్రశంసిస్తున్నారు. ఫిజికల్ టాస్క్ పరంగా ఇంకా డిస్కషన్ విషయంలో సైతం గీతు తానేంటో నిరూపించుకునే రీతిలో వ్యవహరిస్తూ ఉందని బయట జనాలు పొగుడుతున్నారు.
ఎవరి బొమ్మలు వారే కాపాడుకోవాలని బిగ్ బాస్ ఆదేశాలు ఇచ్చిన క్రమంలో … చాలామంది నిర్లక్ష్యంగా వ్యవహరించిన సమయంలో గీతు వారి బొమ్మలను తీసి “లాస్ట్ అండ్ ఫౌండ్” లో వేసేయడం జరిగింది. హౌస్ లో దాదాపు నలుగురు బొమ్మలను “లాస్ట్ అండ్ ఫౌండ్” లో వేసేసి.. రెండో వారం కెప్టెన్ కాకుండా గీతు అడ్డుకోవడం చాలా హైలెట్. ఈ క్రమంలో ఆమె బొమ్మ పోగొట్టుకుని కెప్టెన్ పోటీదారులకి అనర్హత సాధించిన గాని రెండోవారం హౌస్ మొత్తానికి బెస్ట్ ప్లేయర్ మాత్రం గీతు రాయల్ అని ఆడియన్స్ ప్రశంసిస్తున్నారు. ఆమె ఆ గేమ్ ఆడకపోతే హౌస్ లో పోటీ వాతావరణం ఉండేది కాదని కామెంట్లు చేస్తున్నారు.