Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ టైటిల్ ఫేవరేట్ బరిలో సింగర్ రేవంత్ ఉన్న సంగతి తెలిసిందే. ఓటింగ్ పరంగా రేవంత్ భారీ ఎత్తున రాబడుతున్నాడు. రెండు వారాలలో నామినేషన్ ఉన్న నేపథ్యంలో ఓట్లు పరంగా రేవంత్ అందరికంటే ఫస్ట్ ప్లేస్ లోనే ఉంటున్నాడు. ఇదిలా ఉంటే రేవంత్ హౌస్ లో ప్రతి విషయాన్ని మొహం మీదనే చెప్పేస్తున్న సంగతి తెలిసిందే. మాస్క్ లేని గేమ్.. ఆడుతూ స్ట్రాటజీలు వంటివి ఏమీ వేయకుండా.. స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఆడుతున్నాడు. అయితే హౌస్ లో మనోడు మాట తీరుపై కొద్దిగా నెగెటివిటీ ఉన్నా గాని.. తన గేమ్ తో మాత్రం ఎంతగానో ఆకట్టుకుంటున్నాడు.
హౌస్ లో వీక్ కంటెస్టెంట్లకు సలహాలు కూడా ఇస్తున్నారు. ఈ తరహా లోనే ఫైమాకి పలు సూచనలు ఇవ్వడం జరిగింది. కానీ ఫైమా.. రేవంత్ ముందు ఒకలాగా వెనకాల మరోలాగా గేమ్ ఆడుతూ ఉంది. మంగళవారం జరిగిన కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ లో నిన్నెందుకు నేను గెలిపిస్తాను అని… రేవంత్ నీ ఉద్దేశించి ఫైమా డైలాగులు వేయడం తెలిసిందే. అదే సమయంలో.. సాక్స్ అండ్ షేప్స్ లో రేవంత్ గెలవకుండా కొన్ని బొమ్మలు కూడా తన దగ్గర పెట్టేసుకోవడం జరిగింది. దీంతో రేవంత్ ఓడిపోయాడు. అనంతరం ఫైమాకి కాళ్లు నొప్పులు రాగా…. రేవంత్ అన్న నా గేమ్ కూడా నువ్వు ఆడు అంటే ఏ మాత్రం ఆలోచించకుండా రేవంత్ రెండో చాలెంజింగ్ టాస్క్ లో ఫైమా అర్హత సాధించేలా చేశాడు.
తనని ఓడించిన కంటెస్టెంట్ కి కూడా రేవంత్ హెల్ప్ చేయటంతో.. మనోడి గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇదిలా ఉంటే బుధవారం జరిగిన ఎపిసోడ్ లో ఫైమా ఓడిపోయింది. ఆ సమయంలో సంచాలకుడిగా చేసిన రేవంత్ ఉద్దేశించి బెడ్ రూమ్ లో కీర్తి వద్ద బ్యాక్ బీచింగ్ చేయటం జరిగింది. తన ఓటమికి రేవంత్ కారణమని అర్థం లేని వ్యాఖ్యలు చేసింది. దీంతో ఫైమా తనకి తెలియకుండానే మంచి చేస్తున్నా రేవంత్ ని తిడుతూ ఆడియన్స్ వ్యూలో అతనికి మంచే చేస్తుందని విశ్లేషకులు అంటున్నారు.