Bogg Bpss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ రెండో వారం కెప్టెన్సీ పోటీదారుల టాస్క్.. రసవత్తరంగా సాగింది. రెండో వారం కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ లో భాగంగా.. ఎవరి బేబీ బాగోగులు వారే చూసుకోవాలని.. తెలియజేయడం జరిగింది. అజాగ్రత్తగా వ్యవహరిస్తే వేరే వాళ్ళ బేబీ ఎవరికైనా దొరికితే దానిని “లాస్ట్ అండ్ ఫౌండ్” లో వేసేస్తే.. సదరు బేబీ ఇంటి సభ్యులు అనర్హులు అని బిగ్ బాస్ రూల్.
ఈ క్రమంలో మంగళవారం నాడే రేవంత్, అభినయశ్రీ, శ్రీ సత్య బొమ్మలను గీతు లాస్ట్ అండ్ ఫౌండ్ లో వేసేసి వారిని అనర్హులుగా చేసేసింది. అదే రోజు అర్ధరాత్రి శ్రీహాన్.. బొమ్మ కూడా గీతు వేసేయడం జరిగింది. ఇక స్నేహ తనకి అర్జున్ బొమ్మ లాస్ట్ అండ్ ఫౌండ్ లో.. వేయడం జరిగింది. ఇక గీతు బొమ్మ స్టోర్ రూమ్ లో..రేవంత్ కి దొరకటంతో వెంటనే దానిని లాస్ట్ అండ్ ఫౌండ్ లో.. గీతు కూడా అనార్హత అయ్యేలా చేశాడు.
మొత్తం మీద చూసుకుంటే రెండో వారం కెప్టెన్సీ పోటీ దారుల టాస్క్ లో బొమ్మ కోల్పోయి అనర్హులైన వారు రేవంత్, అభినయశ్రీ, శ్రీ సత్య, అర్జున్, శ్రీ హన్, రెండో వారం కెప్టెన్ కావటానికి మొత్తం నలుగురు అర్హత సాధించారు. “లాస్ట్ అండ్ ఫౌండ్” లో ఇతరుల బొమ్మలు ఎక్కువ వేసిన కంటెస్టెంట్ గీతు. ఒక పక్క టాస్క్ ఆడుతూ మరోపక్క ఇతరుల బొమ్మల పై కూడా టార్గెట్ పెట్టుకుని బెస్ట్ పెరఫార్మన్స్ ఇవ్వడం జరిగింది. చంటి, సుల్తానా, సూర్య, రాజ్. ఈ నలుగురిలో ఎవరు కెప్టెన్ అవుతారు అనేది గురువారం ఎపిసోడ్ లో తెలియనుంది.