Bigg Boss Season 6 Day 11 Episode Review: బిగ్ బాస్ సీజన్ 6 బుధవారం ఎపిసోడ్.. మొత్తం కెప్టెన్సీ పోటీదారుల ఎంపికకి సంబంధించినదే. మంగళవారం జరిగిన ఎపిసోడ్ లో రెండో వారం కెప్టెన్సీ పోటీదారుడుగా చంటి గెలవడం జరిగింది. అనంతరం సిసింద్రీ టాస్క్ లో భాగంగా.. రెండో ఛాలెంజ్ లో కీర్తి, అర్జున్, ఫైమా, సుల్తానా, మంగళవారం ఎపిసోడ్ లో టాస్క్ ఆడటానికి అర్హత సాధించారు. అనంతరం అర్ధరాత్రి కావడంతో మిగతావాళ్లు ఎవరి బొమ్మలు వారు బాధ్యతగా దాచుకోవాలని బిగ్ బాస్ ఆదేశాలు ఇచ్చారు. దీంతో బుధవారం ఎపిసోడ్ లో అర్ధరాత్రి హౌస్ లో గీతు.. వేరే వాళ్ళ బొమ్మలు తీయటానికి దొంగతనం చేయడం జరిగింది.
ఈ క్రమంలో శ్రీహాన్ బొమ్మ తీసుకుని “లాస్ట్ అండ్ ఫౌండ్” లో వేసేసింది. అనంతరం శ్రీహాన్… అర్జున్ బొమ్మని “లాస్ట్ అండ్ ఫౌండ్” లో వేయడం జరిగింది. అయితే రాత్రంతా గీతూ బొమ్మని చాలామంది ఇంటి సభ్యులు వెతికారు. కానీ చివర ఆఖరికి గీతుబొమ్మని రేవంత్ కనుగొని “లాస్ట్ అండ్ ఫౌండ్” లో వేసి రివెంజ్ తీర్చుకున్నాడు. ఆ తర్వాత రెండో చాలెంజింగ్ టాస్క్ స్టార్ట్ అయింది. “రింగులో కింగ్” అనే టాస్క్ పెట్టడం జరిగింది. ఈ ఆటకి రేవంత్ సంచాలక్ గా బిగ్ బాస్ నియమించారు. ఈ టాస్క్ లో అర్హత సాధించిన ఫైమా, కీర్తి, అర్జున్, సుల్తానా, ఆరోహి ఆడారు.

చివర ఆఖరికి సుల్తానా గెలవడం జరిగింది. దీంతో రెండో కెప్టెన్ పోటీదారుడుగా సుల్తానాకి బ్యాడ్జ్ ఇచ్చారు. ఈ క్రమంలో సుదీప, ఫైమా బొమ్మలను శ్రీ సత్య, అభినయశ్రీ “లాస్ట్ అండ్ ఫౌండ్” లో వేయటంతో వాళ్ళు కూడా అనర్హులు అయిపోయారు. టాస్క్ ఓడిపోయిన తర్వాత రేవంత్ గురించి కీర్తి దగ్గర ఫైమా బ్యాక్ బిచింగ్ చేయటం జరిగింది. రేవంత్ వల్లే తాను టాస్క్ ఓడిపోయినట్టుగా మాట్లాడింది. ఇక ఇదే రీతిలో “రింగులో కింగ్” టాస్క్ ఆడే సమయంలో సంచాలకుడిగా రేవంత్ సరిగ్గా వ్యవహరించలేదని..ఆరోహి… కీర్తి, వాసంతి దగ్గర డిస్కషన్ పెడితే రేవంత్ తన వివరణ ఇచ్చాడు.
అర్జున్ నీ ఓడించాలని నువ్వే అన్నావు కదా అంటూ.. రేవంత్ చేసిన వ్యాఖ్యలకు ముందు వాగ్వాదం చేసిన కానీ చివరాకరికి.. ఆరోహి ఒప్పుకుంది. అది నా స్ట్రాటజీ అని తెలిపింది. ఆ తర్వాత మూడో చాలెంజింగ్ టాస్క్ కి సూర్య, రాజ్, షానీ, రోహిత్ అర్హత సాధించడం జరిగింది. “ఐస్ క్రీమ్ టైం” అనే టాస్క్ పెట్టడం జరిగింది. ఈ టాస్క్ లో సుల్తానా సంచాలక్. ఈ టాస్క్ లో మొదటి రౌండ్ రాజ్ గెలిచాడు. రెండో రౌండ్ లో సూర్య గెలవడం జరిగింది. దీంతో రెండోవారం కెప్టెన్సీ పోటీ దారులుగా చంటి, సుల్తానా, సూర్య, రాజ్ పోటీ పడనున్నట్లు బిగ్ బాస్ బుధవారం ఎపిసోడ్ చివరిలో ప్రకటించారు. మరి గురువారం జరగబోయే ఎపిసోడ్ లో వీరిలో ఎవరు కెప్టెన్ అవుతారో చూడాలి. కాగా “లాస్ట్ అండ్ ఫౌండ్” లో బొమ్మ పోగొట్టుకున్నీ కెప్టెన్సీ పోటీదారులుగా అనర్హులు అయిన వాళ్ళ లిస్టు.. రేవంత్, అభినయశ్రీ, శ్రీ సత్య, అర్జున్, శ్రీహాన్, ఫైమా, గీతు, సుదిప.