మోనితతో దీప ఇంటికెళ్లిన సంగతి చెబుతాడు కార్తీక్. అది విని షాకైన మోనిత.. తేరుకుని డాక్టర్ బాబుపై అరుస్తుంది. అంతే రేంజ్‌లో కార్తీక్ కూడా వార్నింగ్ ఇస్తాడు. మరోవైపు సౌందర్య హిమతో కలిసి పూజ చేస్తుంది. సౌర్యని మిస్సవుతున్నందుకు బాధపడుతుంది హిమ. అటు దీప తన అన్నయ్యను డాక్టర్ బాబుకు పరిచయం చేస్తుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 14 ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
కార్తీక్‌కు దగ్గరవ్వాలని జ్వరం వస్తున్నట్లు నటిస్తుంది మోనిత. కానీ డాక్టర్ బాబు నిజంగానే వేరొక డాక్టర్‌ని తీసుకొస్తాడు. దాంతో అసలు విషయం బయటపడుతుందని మోనిత కంగారు పడతుంది. డాక్టర్‌గా వచ్చిన దీప అన్నయ్య.. కార్తీక్‌తో మీరు కూడా డాక్టరే కదా అని గతం గుర్తుచేసే ప్రయత్నం చేస్తాడు. మళ్లీ మోనితతో కూడా మీరు ‘డాక్టరే కదా’ అంటాడు. అపుడు మోనితకు అనుమానం కలుగుతుంది. దీప పంపిన డాక్టరా అనుకుంటుంది మనసులో. తర్వాత మోనితను చెక్ చేస్తాడు వచ్చిన డాక్టర్. తనకు జ్వరం లేదని తెలిసినా.. దీప అన్నయ్య మందులు రాసి ఇస్తాడు. అవి చూసి కంగు తింటుంది మోనిత. ఇవి రాసిచ్చావేంటని అడుగుతుంది డాక్టర్‌ని. ‘మీ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా మీరు వంటకు దూరంగా ఉండాలి. కావాలంటే వంట మనిషిని పెట్టుకోండి’ అని సలహా ఇస్తాడు డాక్టర్. వంటలక్కే ఈ డాక్టర్‌ని పంపించిందని చొక్కా పట్టుకుంటుంది మోనిత. దాంతో కార్తీక్ మోనితకు అసలు విషయం చెప్పేస్తాడు. అప్పుడు వంటలక్క ప్లాన్‌ను కార్తీక్‌కి అర్థమయ్యేలా చెబుతుంది మోనిత. ఏమీ తోచని కార్తీక్ డాక్టర్‌ని పంపించేస్తాడు.
డాక్టర్ వెళ్లాక కార్తీక్ మోనితని ఎందుకలా చేశావని ప్రశ్నిస్తాడు. దీప మీద చెడు అభిప్రాయం కలిగేలా లేనిపోనివి కల్పించి చెబుతుంది మోనిత. ఆ తర్వాత సీన్‌లో హిమ సౌర్యని తలుచుకుంటూ బాధపడుతుంది. తను ఎలాంటి తప్పు చేయలేదని అక్కని ఉద్దేశించి మనసులో అనుకుంటుంది. నువ్ కూడా ఇక్కడే ఉంటే ఎంత బాగుండేది. ఇద్దరం కలిసి స్కూల్‌కి వెళ్లి కలిసి చదువుకునే వాళ్లం.. అంటూ మదనపడుతుంది. దారిలో హిమకు సరోజ కలుస్తుంది. సౌర్య గురించి అడిగి.. దీప, కార్తీక్‌లను కూడా గుర్తుచేస్తుంది. ‘మోనిత డాక్టర్ బాబు చనిపోయిన తర్వాత పూర్తిగా పిచ్చిదై పోయింది. తన ఆస్తి, కొడుకును మా చెల్లికి ఇచ్చి ఎటో వెళ్లిపోయింది’ అని చెబుతుంది హిమతో. అది విని సంతోషం పడుతుంది హిమ. తమ్ముడు మీ దగ్గర ఉన్నాడా? ఒకసారి చూడాలని ఉంది.. అంటుంది సరోజతో. సరేనమ్మా వెళ్దాం పద అంటూ తీసుకెళ్తుంది సరోజ హిమని.
ఆ తర్వాత సీన్‌లో మోనిత దీప కొట్టిన దెబ్బ గురించి ఆలోచిస్తూ భయపడుతుంది. ఏం చేయదనుకున్న దీప.. ఊహించిన దాని కంటే ఎక్కువే చేస్తుంది అనుకుంటుంది మనసులో. కార్తీక్‌ని దీపకు దూరంగా ఉంచాలని ప్లాన్ చేస్తుంది. అంతలోనే కార్తీక్ వచ్చి.. ఏం ఆలోచిస్తున్నావ్ మోనిత. తప్పిపోయిన మన బాబు గురించేనా అంటాడు అమాయకంగా. ‘వంటలక్క తర్వాత కార్తీక్ ఎక్కువగా గుర్తుంచుకున్నది బాబు గురించి మాత్రమే. అంటే నా మీద లేని ప్రేమ నా కొడుకు మీద ఉంది. వెంటనే బాబుని తీసుకొస్తే కార్తీక్‌కి నామీద కూడా ప్రేమ పుడుతుంది’ అనుకుంటూ సంబరపడిపోతుంది మోనిత లోలోపల. ‘అంతా నా వల్లే కదా. నా వల్లే బాబు దూరమయ్యాడు కదా. అప్పుడప్పుడు గుర్తొస్తే నాకే బాధేస్తుంది. బాబు ఆచూకీ ఏమైనా తెలిసిందా’ అని అడుగుతాడు డాక్టర్ బాబు. వెంటనే తడుముకోకుండా మోనిత బాబు ఆచూకీ తెలిసిందని, తను చెన్నైలో ఉన్నాడని చెప్పేస్తుంది. ‘మరి ఇంకెందుకు ఆలస్యం.. వెళ్లి బాబుని తీసుకొద్దాం పద’ అని కార్తీక్ చెప్పగా.. నువ్ ఎక్కడికి వస్తావ్. నీ ఆరోగ్యం బాగలేదు అంటూ దబాయిస్తుంది మోనిత. నేను .ఒక్కరోజులో వెళ్లి తీసుకొచ్చి నీ చేతిలో పెడతానని మాటిస్తుంది కార్తీక్‌కి.
‘ఎంతైనా రక్త సంబంధం కదా. తమ్ముడు ఉన్నాడని తెలియగానే వచ్చేసింది’ అంటూ హిమని ఉద్దేశించి అంటుంది సరోజ చెల్లి. హిమ తమ్ముడిని తనతో పాటు తీసుకెళ్తానని అడుగుతుంది. దానికి వారు ఒప్పుకోరు. మోనిత తమకు ఆస్తినంతా ఇచ్చి బాబును ఎవరికి ఇవ్వకూడదని చెప్పింది అంటారు. తను అడిగినా ప్రయోజనం లేదనుకున్న హిమ నానమ్మ, తాతయ్యలతో అడిగించాలనుకుంటుంది.
సీన్ కట్ చేస్తే.. దీప, తన అన్నయ్య మోనిత చేస్తున్న కుట్ర గురించి, తన రాక్షసత్వాన్ని తలుచుకుంటూ బాధపడతారు. మోనిత పెద్ద మోనార్కని, తనని ఎలా మార్చాలని కన్నీరు పెడుతుంది దీప. నా భర్తను నా దగ్గరికి చేర్చుకోవడానికి ఈ పోరాటాలేంటి అన్నయ్యా.. అని కంటతడి పెడుతుంది. నువ్ అనుకున్నది సాధిస్తావని ధైర్యం చెప్పి దీపని ఓదారుస్తాడు అతడు. దాంతో దీప మోనిత అంతు తేల్చి.. నా డాక్టర్ బాబుని తెచ్చుకుంటానని చెప్పి వెళ్తుంది అక్కడికి. దీపని తన అన్నయ్య మోటివేట్ చేయగా డాక్టర్ బాబు కోసం వెళ్తుంది. దీపని కార్తీక్ తప్పు పట్టడానికి గల కారణమేంటో తెలియాలంటే తరువాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే..