Raviteja: తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఏ విధమైనటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి కెరియర్ మొదట్లో పలు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి అనంతరం సినిమాలలో సపోర్టింగ్ పాత్రలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు నటుడు రవితేజ. ఇలా ఈయన ఎన్నో సినిమాలలో సహాయ నటుడిగా నటించిన అనంతరం హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.
రవితేజ ఎక్కువగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలలో నటించి బాక్సాఫీస్ వద్ద మంచి విజయం అందుకున్నారు. ఇలా ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ వరుస సినిమాలు చేస్తూ వచ్చారు.కెరీర్ మొదట్లో ఈయన చేసిన సినిమాలన్నీ కూడా సూపర్ హిట్ కావడంతో ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. అయితే ఈ మధ్యకాలంలో రవితేజ తన సినిమాల విషయంలో తడబడుతున్నారని తెలుస్తోంది.
ఈయన ఒకే తరహా కథలను ఎంపిక చేసుకుంటూ రొటీన్ ఫార్ములాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.అయితే ఓకే తరహా పాత్రలలో ఈయన సినిమాలు చూసిన ప్రేక్షకులు తన సినిమాలను తిరిగి చూడటానికి ఇష్టపడకపోవడంతో ఈ మధ్యకాలంలో రవితేజ నటించిన సినిమాలన్నీ కూడా వరుసగా ఫ్లాప్ అవుతున్నాయి. చాలాకాలం తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో క్రాక్ సినిమా ద్వారా హిట్ అందుకున్న ఈయన అనంతరం తన సినిమాల విషయంలో అదే ఫార్ములా పాటిస్తున్నారు.
Raviteja: కథల ఎంపిక విషయంలో తడబడుతున్న రవితేజ…
ఈ క్రమంలోనే క్రాక్ సినిమా తర్వాత రవితేజ నటించిన ఖిలాడీ,రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమాలు ఎన్నో అంచనాల నడుమ విడుదలైనప్పటికీ రొటీన్ కథ కావడంతో బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.అయితే ఈ విషయాన్ని రవితేజ గుర్తించి కథల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే ఈయనకు ఇండస్ట్రీలో మనుగడ ఉంటుంది.ఈయన వయసుకు తగ్గ కొత్త తరహా పాత్రలలో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తేనే ఈయనకు అవకాశాలు వస్తాయని లేకపోతే కెరియర్ ఇబ్బందులలో పడే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.