Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం రెండో వారం కెప్టెన్సీ పోటీదారులకి సంబంధించి టాస్క్ జరుగుతుంది. రెండో వారం కెప్టెన్ కావటానికి ఇంటి సభ్యుల మధ్య హోరాహోరీ పోటీ నడుస్తోంది. మంగళవారం ఎపిసోడ్ లో.. కెప్టెన్సీ పోటీదారులు కావడానికి “సిసింద్రీ” టాస్క్ లో కెప్టెన్సీ మొదటి పోటీదారుడుగా చంటి గెలవడం తెలిసిందే. ఇక ఇదే సమయంలో రేవంత్, అభినయశ్రీ, శ్రీ సత్య అనర్హులుగా మిగిలిపోయారు.
దీంతో బుధవారం జరగబోయే ఎపిసోడ్ లో మిగతా కంటెస్టెంట్లు ఎవరూ అన్నది సస్పెన్స్ గా ఉంది. అయితే బిగ్ బాస్ షో లైవ్ లో మరో ముగ్గురు కెప్టెన్సీ పోటీ దారులుగా గెలవడం జరిగిందట. మంగళవారం మొదటి ఛాలెంజింగ్ టాస్క్ నిర్వహించగా బుధవారం రెండో ఛాలెంజింగ్ టాస్క్ పెట్టడానికి టైం ఉండటంతో మధ్యలో అర్ధరాత్రి ఆట ముగిసే సమయానికి.. బిగ్ బాస్ ఇంటి సభ్యులందరిని తమ బేబీ లను కాపాడుకోవాలని.. ఆదేశాలు ఇవ్వటం జరిగింది.
ఈ క్రమంలో గీతు రాయల్ కొంతమంది బేబీ లను “లాస్ట్ అండ్ ఫౌండ్” లో వేయడం జరిగింది. అదేవిధంగా గీత బొమ్మ కూడా రేవంత్.. “లాస్ట్ అండ్ ఫౌండ్” జోన్ లో వేసేశాడు. ఈ క్రమంలో మిగతా కెప్టెన్సీ పోటీ దారులుగా సుల్తానా, రాజశేఖర్, సూర్య గెలవడం జరిగిందట. దీంతో రెండో వారం కెప్టెన్సీ పోటీదారుల బరిలో కెప్టెన్ కావడానికి చంటి, సుల్తానా, రాజశేఖర్, సూర్య పోటీ పడుతున్నారట. మరి బుధవారం జరగబోయే ఎపిసోడ్ లో ఈ నలుగురిలో కెప్టెన్ ఎవరు అవుతారో చూడలి.