Ileana D’cruz : బాలీవుడ్ సినీ తారల ప్రేమాణయాలు ఎవరికీ అంతు చిక్కవు. ఒక్కొక్కరి లవ్ స్టోరీ మూనాళ్ల ముచ్చటగానే కొనసాగుతూ ఉంటుంది. అదృష్టం ఉంటే ప్రేమించిన వారిని పెళ్లి చేసుకుంటారు. లేదంటే బ్రేకప్ తో మరో రిలేషన్‌షిప్‌కు సై అంటారు. ప్రస్తుత్తం ఇలియా డిక్రూజ్ పరిస్థితి కూడా ఇదే రకంగా ఉంది. మొన్నటి వరకు ప్రముఖ ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్‌తో డేటింగ్ చేసిన ఇల్లీ బేబీ ఒక రోజు ఆ రిలేషన్‌కు బ్రేకప్ చెప్పింది. దీని గురించి ఎక్కడా నోరువిప్పకూడదని నిర్ణయించుకున్న ఇలియాన కొన్నాళ్ల డిప్రెషన్ తరువాత ఇప్పుడిప్పుడే ఆ మూడ్ నుంచి బయటపడుతోంది. దీనికి కారణం లేకపోలేదు. ఇలియానాకు మళ్లీ ప్రేమ బంధం దొరికిందని కత్రిన అన్నతో దోస్తీ కుదిరిందని ఇండస్ట్రీ కోడై కూస్తోంది. త్వరలో వీరిద్దరికి పెళ్లని ఇండస్ట్రీలో వీరి విషయమే హాట్ టాపిక్‌గా నిలుస్తోంది.

Ileana D’cruz : వీరి రిలేషన్ షిప్‌కి మరింత బాలన్ని అందించే పిక్స్ కూడా నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. జులైలో జరిగిన కత్రినా కైఫ్ బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో ఇల్లిబేబీ కూడా పాల్గొంది. ఫ్యామిలీతో మాత్రమే జరిగిన ఈ సెలబ్రేషన్స్‌లో ఇలియానా ఎలా యాడ్ అయ్యిందంటూ అందరూ చెవులు కొరుకున్నారు. ఈ క్రమంలో కత్రినా అన్న సెబాస్టియన్ లారెంట్ మిచెల్ తో క్లోజ్‌గా ఉండటం వారిద్దరూ సాన్నిహితంగా ఉన్న పిక్స్ కత్రినా పోస్ట్ చేయడంతో అందరూ కన్ఫర్మేషన్‌కు వచ్చేశారు. ఇలియానా కత్రినా అన్నతో ప్రేమలో పడిందని త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతోందని తెలుస్తోంది. తాజాగా పెళ్లి పనుల్లో ఇలియానా నిమగ్నమైందని షాపింగ్ చేస్తూ బిజీ బిజీగా ఉందని టాక్.

ఇలియానా, సెబాస్టియన్ గత 6 నెలలుగా డేటింగ్ లో ఉన్నట్లు సమాచారం. ఇప్పటి వరకు అఫీషియల్‌గా ఈ జంట ఎక్కడా బయటపడలేదు. ఓ ప్రముఖ న్యూస్ పేపర్‌లో వీరి రిలేషన్ గురించి తెలిపిన వివరాల ప్రకారం ఈ జంట కత్రినా బంద్రా ఇంట్లో ఉంటున్నట్లు తెలుస్తోంది. ఒకరిని ఒకరి సన్నిహితంగా అర్థం చేసుకుంటున్నారని తెలిపింది. మీడియా కథనాలు నిజమే అయితే మరికొద్ది రోజుల్లోనూ వీరి ఇంట్లో బ్యాండ్ బాజాలు మొగడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇలియానా ప్రస్తుతం పెద్దగా సినిమాలు చేయడం లేదు. సోషల్ మీడియాలో మాత్రం యమ యాక్టివ్‌గా ఉంటోంది. తన పర్సనల్ విషయాలను ఫోటో షూట్ పిక్స్‌ను ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఫోలోవర్స్‌ను ఇంప్రెస్ చేస్తుంటుంది. చివరిసారిగా ఇలియానా ది బిగ్ బుల్ చిత్రంలో అభిషేక్ బచ్చన్ సరసన కనిపించి తన నటనతో మెప్పించింది. ఆ తరువాత పెద్దగా సినిమాలేమి చేయడం లేదు ఈ భామ.