టాలీవుడ్ లో స్టార్ హీరోగా కింగ్ నాగార్జున తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్నారు. బ్రహ్మాస్త్ర సినిమాతో తాజాగా బాలీవుడ్ లో సూపర్ సక్సెస్ అందుకున్న నాగ్ ఘోస్ట్ సినిమాతో అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. ఈ సినిమాపై నాగ్ చాలా నమ్మకం పెట్టుకున్నారు. కచ్చితంగా ఘోస్ట్ సూపర్ హిట్ అవుతుందనే బలంగా చెబుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో నాగార్జున ఆసక్తికర విషయాలనిపంచుకున్నారు. హాలీవుడ్ దర్శకులు గేమ్ ఆఫ్ థ్రోన్స్, లార్డ్ అఫ్ ది రింగ్స్ లాంటి భారీ చిత్రాలని కథలు లేకపోయిన తెరకెక్కిస్తున్నారని, అలాగే అడ్వాన్స్ ఆలోచనలతో భారీ బడ్జెట్ చిత్రాలు చేస్తున్నారని అన్నారు.
అయితే మనం కథల కోసం ఇబ్బంది పడాల్సిన పని లేదని మహాభారతం, భాగవతం చదువుకుంటే అద్భుతమైన కథలు ఎన్నో కనిపిస్తాయని, అలాంటి కథలని ఆవిష్కరిస్తే ఇండియన్ సినిమా స్థాయిని అందుకోవడం ఎవరి తరం కాదని పేర్కొన్నారు. అలాగే ప్రస్తుతం ఓటీటీలు ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడం చాలా మంచి పరిణామం అని నాగార్జున పేర్కొన్నారు. ఓటీటీల కారణం సినిమాలకి ఎలాంటి ఇబ్బంది లేదని ఇంకా సినిమా మార్కెట్ మరింత పెరగడానికి ఓటీటీలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
అయితే విదేశీ చిత్రాలని కూడా ఇప్పుడు ఓటీటీలో చూడగలుగుతున్నాం. ఇలాంటి పరిస్థితిలో దర్శకులు ఒకే మూసలో ఆలోచించకుండా కచ్చితంగా అప్డేట్ అవ్వాల్సిన ఉందని చెప్పుకొచ్చారు. యూనివర్శల్ స్టాండర్డ్స్ లో ఆలోచించి కథలు సిద్ధం చేస్తే మరిన్ని మంచి చిత్రాలు ప్రేక్షకులకి అందించ వచ్చని నాగార్జునచెప్పడం విశేషం. ఆయన మతాల బట్టి దర్శకుల ఆలోచన శైలి మార్చుకొని కొత్తదనం ఉన్న కథలని సిద్ధం చేయాలనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది.