Biggboss 6 : పిట్ట పోరు.. పిట్ట పోరు.. పిల్లి తీర్చినట్టుంది బిగ్‌బాస్ 6 వ్యవహారం. బిగ్‌బాస్ ఇక్కడ ఏదైనా జరగొచ్చు అన్న హోస్ట్ నాగార్జున మాటలు అక్షరాలా నిజం అనిపిస్తోంది. బిగ్‌బాస్ హౌస్‌లో సెకండ్ నామినేషన్స్ సోమవారం ముగిశాయి. సెకండ్ వీక్ నామినేషన్స్‌లోకి ఒక్క ఓటు పడిన వారు సైతం వచ్చేశారు. ఈ నామినేషన్స్ పర్వం అంతా కాస్త గట్టిగానే జరిగింది. విశేషం ఏంటంటే ఈసారి సింగర్ రేవంత్ తనను తాను సముదాయించుకునేందుకు ట్రై చేశాడు. కాస్త కూల్‌గా ఉండేందుకు యత్నించాడు. చాలా వరకూ ఉన్నాడు కూడా. మొత్తానికి నామినేషన్స్ పర్వం ముగిసింది. రేవంత్, ఆదిరెడ్డి, గలాటా గీతూ, చలాకీ చంటి, రోహిత్ అండ్ మెరీనా, రాజశేఖర్, షానీ, ఆరోహి తదితరులంతా నామినేషన్స్‌లోకి వచ్చేశారు.
రొట్ట, రోత బ్యాచ్‌లను బ్యాలన్స్ చేస్తూ రివ్యూలు ఇవ్వడం అంటే అదంత ఈజీ కాదు.. ఇలాంటి అసాధ్యాలను సుసాధ్యం చేసి.. బిగ్ బాస్ రివ్యూవర్‌గా పాపులర్ అయిన ఆదిరెడ్డి.. అలియాస్ ఉడాల్ మామ.. బిగ్ బాస్ 6 హౌస్‌లో అడుగుపెట్టాడు. అంతేకాదు.. టాస్క్‌ల్లోనూ 100 పర్సెంట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి ఆకట్టుకుంటున్నాడు. కామనర్ కోటాలో హౌస్‌లోకి వెళ్లిన ఆదిరెడ్డి.. బిగ్ బాస్ ఆటను బయట నుంచి బాగా అధ్యయనం చేసి.. అక్కడ ఎలా ఉంటే ముందుకు వెళ్లొచ్చే సరిగ్గా అదే ప్లానింగ్‌తో ఆటాడుతున్నాడు. అయితే కొన్నిసందర్భాల్లో కాస్త అతి కనిపిస్తున్నప్పటికీ.. నామినేషన్స్‌లో కానీ టాస్క్‌లలో కానీ పక్కా ప్లానింగ్‌తో ఉంటున్నాడు.
Biggboss 6 : ఎవరితోనైనా కనెక్షన్ లేదని హౌస్ నుంచి వెళ్లిపోవాలా?
ఇక బిగ్ బాస్‌కి వెళ్లే ముందు కూడా.. గట్టి ప్లానింగ్‌తోనే వెళ్లినట్టు తెలుస్తోంది. దీనికి నిదర్శనమే.. ఇప్పటికే అతని పేరుతో ఫ్యాన్ పేజీలు దర్శనమివ్వడం. ఇప్పుడైతే ఆదిరెడ్డి టాప్ ట్రెండింగ్‌లో ఉన్నాడు. శనివారం కూడా నాగ్ అతని ఆట తీరును కొనియాడారు. ఆ తరువాతి రోజు అంటే సోమవారం నాడు.. నామినేషన్స్‌లో ఆది రెడ్డి హైలైట్ అయ్యాడు. ఆరోహికి ఇచ్చిన పంచ్ కాస్త గట్టిగానే పేలింది. ఎవరితోనైనా కనెక్షన్ లేదని హౌస్ నుంచి వెళ్లిపోవాలా? లేదంటే సరిగా ఆడటం లేదని బయటికెళ్లాలా? అని ఆరోహిని ప్రశ్నించాడు. చాలా వాలీడ్ క్వశ్చన్ అది. తొలివారంలో పెద్దగా కనిపించని ఆదిరెడ్డి.. మలివారానికి ఫామ్‌లోకి వచ్చేశాడు. అతని కోసం కొన్ని పేజ్‌లు గట్టిగా పని చేస్తుండటంతో ఒక్కసారిగా ఆది రెడ్డి ట్రెండింగ్‌లోకి వచ్చేశాడు. #AdiReddy అనే హ్యాష్ ట్యాగ్ నెట్టింట వైరల్ అవుతోంది.