Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ 9వ రోజు ఎపిసోడ్ మంగళవారం నాడు హౌస్ లో రసవత్తరమైన పోటీ సాగింది. కెప్టెన్సీ పోటీదారులు కావడానికి సిసింద్రీ అనే టాస్క్ ఇంటి సభ్యులకు ఇవ్వడం జరిగింది. టాస్క్ లో భాగంగా ప్రతి ఇంటి సభ్యుడికి ఒక బేబీ బొమ్మని ఇచ్చారు. ఈ బేబీ బొమ్మ ఆలనా పాలనా చూసుకుంటూనే మరోపక్క బిగ్ బాస్ ఇచ్చే ఆదేశాలను.. పాటించాలని ఇంటి సభ్యులకు బిగ్ బాస్ తెలియజేశారు.
అయితే ఏ ఇంటి సభ్యుడి బొమ్మ అయినా.. వేరే వ్యక్తికి దొరికితే దానిని గార్డెన్ ఏరియాలో “లాస్ట్ అండ్ ఫౌండ్” జోన్ లో వేసేస్తే సదరు బొమ్మ కలిగిన సభ్యుడు కెప్టెన్సీ పోటీదారుడుకి అనర్హుడు అని బిగ్ బాస్ ప్రకటించారు. ఈ గేమ్ లో గీతు రాయల్.. చాలా దూకుడుగా ఆడింది. గెలవటమే లక్ష్యంగా కేవలం టాస్కులు మాత్రమే కాదు…వేరే వాళ్ళ బేబీ బొమ్మ టార్గెట్ తో.. గేమ్ ఆడింది. ఈ రకంగా గేమ్ ఆడి రేవంత్, శ్రీ సత్య, అభినయశ్రీ బొమ్మలను “లాస్ట్ అండ్ ఫౌండ్” లో గీతు వేయడం జరిగింది.
దీంతో ఈ ముగ్గురు రెండో వారం కెప్టెన్సీ పోటీదారులు కావడానికి అనర్హులైపోయారు. మంగళవారం రెండో ఛాలెంజింగ్ టాస్క్ మొదలవటానికి అర్ధరాత్రి కావడంతో అందరినీ తమ బొమ్మలను జాగ్రత్త చేసుకోవాలని బిగ్ బాస్ సూచించారు. ఇదే సమయంలో ఎపిసోడ్ చివరిలో తాను దొంగతనానికి రెడీ అవుతున్నట్లు హౌస్ లోకి కెమెరాలకు గీతు తెలియజేయడం జరిగింది. దీంతో బుధవారం ప్రసారమయ్యే ఎపిసోడ్ లో.. గీతు ఎంతమంది దగ్గర బొమ్మలు లేపేస్తుందో సస్పెన్స్ గా నెలకొంది.