Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో సింగర్ రేవంత్ హవా కొనసాగుతుంది. మనోడు మాస్క్ లేకుండా ఏదైనా మొహం మీద చెప్పేయటం.. మరోపక్క ఇంటి సభ్యులందరూ మనోడిని గట్టిగా టార్గెట్ చేయడం.. రేవంత్ కి బాగా ప్లస్ అయిపోయింది. గత రెండు రోజులు చూస్తే రేవంత్ ఆడుతున్న ఆట తీరకు ఆదిరెడ్డి సైతం ఆశ్చర్యపోతున్నాడు. కాగా మంగళవారం జరిగిన ఎపిసోడ్ లో కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ లో భాగంగా మొదటి ఛాలెంజింగ్ టాస్క్ “సక్స్ అండ్ షేప్స్” నిర్వహించారు. ఈ గేమ్ ఆడటానికి రేవంత్, ఫైమా, చంటి, ఆరోహి, గీతు అర్హత సాధించడం జరిగింది. గార్డెన్ ఏరియాలో ఒకపక్క ఖాళీ బోర్డులో..షేప్స్ ఉంటాయి. సరిగ్గా వాటికి సంబంధించిన బొమ్మలు వేరే వైపు ఉంటాయి.
అయితే ఈ టాస్క్ లో పోటీదారులు గోనెపట్టతో గెంతుకుంటూ.. ఒకపక్క ఉన్న బొమ్మలు తీసుకెళ్లి వేరే వైపు షేప్స్ కలిగిన బోర్డులో పెట్టాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఐదుగురిలో మొదట రేవంత్ దాదాపు అన్ని పెట్టేస్తాడు. ఒక్క షేపుకి సంబంధించి.. బొమ్మ అది పైమా దగ్గర ఉంటుంది. రేవంత్ ఇది తెలుసుకొని ఫెయిమా నీ అడగటం జరుగుద్ది. చివరివరకు తనకు తెలియదు అన్నట్టుగా వినబడనట్టుగా..ఫైమా గేమ్ ఆడుది. దీంతో రేవంత్ ఓడిపోయి కెప్టెన్సీ పోటీదారుడిగా చంటి గెలుస్తాడు.
ఇదే సమయంలో ఫైమా కాలు కొద్దిగా డ్యామేజ్ అవుద్ది. టాస్క్ అయిపోయిన అనంతరం నిరుత్సాహానికి గురై రేవంత్ కంటనీరు పెట్టడం జరిగింది. అనంతరం టాస్క్ లో తనకి దెబ్బేసిన ఫైమా దగ్గరికి వెళ్లి.. ఆమె కాలు గురించి అడిగి తెలుసుకోవడం జరుగుద్ది. ఈ క్రమంలో ఫైమా తన గేమ్ వేరే వారితో ఆడించడానికి రెడీ అవ్వడంతో రేవంత్ మనసులో ఏమి పెట్టుకోకుండా ఫైమా గేమ్ ఆడటానికి ఒప్పుకోవటం మాత్రమే కాదు రెండో చాలెంజింగ్ టాస్క్ కి ఫైమా.. అర్హత సాధించేలా చేస్తారు. దీంతో తనకి చెడు చేసిన గాని రేవంత్ మంచి చేయడంతో మంగళవారం జరిగిన ఎపిసోడ్ తర్వాత రేవంత్ ఓటింగ్ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.