Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ 6 రెండో వారం కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ ఇంటి సభ్యుల మధ్య చిచ్చు పెట్టింది. ఈ టాస్క్ లో భాగంగా మొదటి చాలెంజింగ్ టాస్క్ లో రేవంత్ దాదాపు గెలిచే పరిస్థితి ఉన్న సమయంలో ఫెమా ఆడిన ఆట తీరు గేమ్ మొత్తాన్ని మార్చేసింది. బిగ్ బాస్ హౌస్ లో స్ట్రాటజీ వేసే వ్యక్తి.. తనని గెలిపించుకోవడానికి ఆడుతుంటాడు. కానీ ఫైమా తను ఆల్రెడీ ఓడిపోయే పరిస్థితుల్లో ఉన్న సమయంలో పక్కోలని గెలిపించడానికి.. స్ట్రాటజీ వేయడం జరిగింది.
రేవంత్ పెట్టాల్సిన బొమ్మ తన దగ్గరే ఉంచుకుని గేమ్ చివరి వరకు సాగేలా చేసింది. ఆమె గెలిచే పరిస్థితి లేకపోయినా గాని రేవంత్ గెలుపుని అడ్డుకుంది. ఇదే సమయంలో చంటి గెలుపుకి కారణం కూడా అయింది. దీంతో ఫైమా రాంగ్ గేమ్ ఆడిందని మంగళవారం ఎపిసోడ్ తర్వాత బిగ్ బాస్ ఆడియన్స్ నుండి విమర్శలు వస్తున్నాయి. ఈ టాస్క్ స్టార్ట్ అవ్వకముందు.. రేవంత్ ఆటపరంగా ఫైమాకి చాలా సలహాలు ఇవ్వటం జరిగింది.
కమెడియన్ లాగా ఉండకు. చాలా తెలివిగా గేమ్ ఆడు అని మంచి చెప్పిన రేవంత్ కే.. వెన్నుపోటు పొడిచి చంటి గెలవడంలో ఫైమా వ్యవహరించిందని ఇది చాలా అన్యాయం అని అంటున్నారు. రేవంత్ ఓడిపోవడంతో… మొదటి చాలెంజింగ్ టాస్క్ చంటి విజయం సాధించడంతో కెప్టెన్ పోటీదారుడిగా చంటి సెలెక్ట్ అయ్యాడు. చంటి గెలవడం పట్ల కూడా రేవంత్.. చంటిని అభినందించడం విశేషం.