Bigg Boss Season 6 Day 9 Episode Review: బిగ్ బాస్ సీజన్ సిక్స్ 9వ రోజు ఎపిసోడ్ మంగళవారం నాడు హౌస్ లో కెప్టెన్సీ టాస్క్ కి సంబంధించి ఇంటి సభ్యుల మధ్య పోటీ వాతావరణం నెలకొంది. ఎపిసోడ్ స్టార్ట్ అయిన వెంటనే సోమవారం జరిగిన నామినేషన్ ప్రక్రియకు సంబంధించి.. కొంత డిస్కషన్ ఇంటి సభ్యుల మధ్య జరిగింది. అర్జున్ ఇంకా రేవంత్.. పలువురు ఇంటి సభ్యుల మధ్య జరిగింది. ఇదే సమయంలో కెప్టెన్ బాలాదిత్య.. చాలామంది మాటతీరు విషయంలో రేవంత్ ని నామినేట్ చేయడంపై.. స్పందించి రేవంత్ కి పలు సూచనలు ఇచ్చారు. ఇక గీతు సైతం తనని చాలామంది నామినేట్ చేయటాన్ని లైట్ తీసుకోవడం జరిగింది. కొంతమంది సేఫ్ గేమ్ లో భాగంగా తనని నామినేట్ చేసినట్లు.. గీతు డైలాగులు వేయడం జరిగింది.
అనంతరం అర్ధరాత్రి కొంతమంది ఇంటి సభ్యులు.. సూర్య, ఫైమా, ఆరోహీ.. ఇంకా కొంతమంది కిచెన్ లో దొంగతనంగా కొన్ని ఐటమ్స్ చేసుకొని తినడం జరిగింది. ఇదే సమయంలో సూర్య…ఆరోహీ ఇంటి సభ్యుల గురించి డిస్కషన్ చేసుకున్నారు. ఈ క్రమంలో బాలాదిత్యా చాలా టఫ్ కంటెస్టెంట్ చాలా బాగా గేమ్ ఆడుతున్నారని మాట్లాడుకున్నారు. ఇంకా సూర్య హౌస్ లో నువ్వు తప్ప ఇంటిలో నాకు పెద్దగా ఎవరూ తెలియదు. మనిద్దరికీ బయట నుండి బాండింగ్ ఉంది. సో రాబోయే రోజుల్లో ఇద్దరం కలిసి గేమ్ ఆడతారు.. అనే విమర్శలు కూడా హౌస్ నుండి రావచ్చు. అన్నిటికీ రెడీగా ఉండు అంటూ ఆరోహికి తెలియజేశాడు. గేమ్ పరంగా ఎవరికి వారు ఆడదామని కూడా తెలిపాడు. ఇంకా నామినేషన్ తర్వాత హౌస్ లో జరిగిన డిస్కషన్ లలో అర్జున్ కొద్దిగా శ్రీ సత్యకి క్లోజ్ అవుతున్నట్లు.. అతని మాటలు బట్టి తెలుస్తుంది.
ఆ తర్వాత రోజు ఉదయం రేవంత్..ఫైమాకి పలు సూచనలు ఇవ్వడం జరిగింది. నిన్ను చూస్తే కమెడియన్ అనే ముద్ర పడిపోతుంది. అలా కాకుండా వేరే కోణంలో గేమ్ ఆడు అని పలు సూచనలు ఫైమాకి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత కెప్టెన్ బాలాదిత్యతో కలిసి రేవంత్.. శ్రీ సత్యతో డిస్కషన్ పెట్టాడు. ఒంటరిగా వద్దు అందరితో కలిసి భోజనం చేయాలని శ్రీ సత్యకి ఇద్దరు చెప్పడం జరిగింది. అందరితో కలిసి తినాలంటే నావల్ల కాదు. నాకు నచ్చింది నేను చేస్తాను అని శ్రీ సత్య తెలిపింది. ఆ తర్వాత బిగ్ బాస్ కెప్టెన్సీ పోటీదారులు కావటానికి “సిసింద్రీ” అనే టాస్క్ పెట్టడం జరిగింది. ఈ టాస్క్ లో ప్రతి సభ్యుడికి ఒక బేబీ బొమ్మ ఇచ్చారు. ఆ బేబీ ఆలనా పాలనా చూసుకుంటూనే మరోపక్క బిగ్ బాస్ పెట్టే ఛాలెంజింగ్ టాస్క్ ఆడాలని ఇంటి సభ్యులకు తెలియజేయడం జరిగింది. ఈ క్రమంలో ఎవరి బేబీ వారి చేతిలో ఉన్న సమయంలో బిగ్ బాస్ కొంతమంది పేర్లు పిలవగా.. వాళ్లకు సంబంధించిన బేబీలకి..బిగ్ బాస్ ఆదేశాల మేరకు అన్నంతో పాటు డైపర్స్ వేయడం జరిగింది. ఈ టైంలో గీతుతో బిగ్ బాస్ పలు కామెడీలు చేయడం జరిగింది. అనంతరం కెప్టెన్సీ పోటీదారులకి సంబంధించి మొదటి చాలెంజింగ్ టాస్క్…”సక్స్ అండ్ షేప్స్” ఇంటి సభ్యులకు పెట్టడం జరిగింది.
Bigg Boss Season 6 Day 9 Episode Review: రేవంత్, శ్రీ సత్య, అభినయశ్రీ అనర్హులుగా బిగ్ బాస్ తేల్చారు..!!
అయితే ఈ గేమ్ లో ఎవరి బేబీ కూడా ఎక్కడ వదిలేయకూడదని.. ఎవరి బేబీ అయినా ఇతర సభ్యుడికి దొరికితే దానిని “లాస్ట్ అండ్ ఫౌండ్”లో వేస్తే సదరు బొమ్మ సభ్యుడు కెప్టెన్సీ పోటీదారుడికి అనర్హుడు అవుతారని తెలియజేయడం జరిగింది. ఈ క్రమంలో బజార్ మౌనంగానే మొదటి చాలెంజింగ్ టాస్క్ ఆడటానికి రేవంత్, ఫైమా, ఆరోహి, చంటి, గీతు లకి అవకాశం లభించింది. సంచలక్ గా నేహా చౌదరి ఉంది. అయితే ఈ మొదట చాలెంజింగ్ టాస్క్ లో రేవంత్ ఆల్మోస్ట్ గెలిచే పరిస్థితి ఉన్న క్రమంలో ఫైమా వేసిన ఎత్తుగడకి ఓడిపోయాడు. చంటి గెలవడం జరిగింది. దీంతో ఎంతో నిరుత్సాహానికి గురైన రేవంత్.. ఫైమాపై పరోక్షంగా సీరియస్ అయ్యాడు. అందరు భయపడిపోతున్నారు చాలా టఫ్ కాంపిటీషన్.. దినదిన గండం అంటూ.. తనని అందరూ కలిసి ఓడించారని రేవంత్ డైలాగులు వేయడం జరిగింది. అయితే రేవంత్ బాగా ఆడటం పట్ల ఆదిరెడ్డి అభినందించారు. ఈ క్రమంలో రేవంత్ తన బేబీ పక్కన పెట్టడంతో గీతు.. రేవంత్ బేబీని “లాస్ట్ అండ్ ఫౌండ్” లో వేయడంతో రేవంత్ రెండో వారం బిగ్ బాస్ కెప్టెన్సీ పోటీదారుడు కావడానికి అనర్హుడయ్యాడు. మరో రెండో ఛాలెంజింగ్ టాస్క్ స్టార్ట్ అవ్వడానికి సమయం ఉంటున్న గ్యాప్ లో శ్రీ సత్య, అభినయశ్రీ బేబీలను కూడా “లాస్ట్ అండ్ ఫౌండ్” లో గీతు వేయడం జరిగింది. ఈ క్రమంలో రెండో చాలెంజింగ్ టాస్క్ బజార్ మోగటంతో మొదట అయిదుగురు అర్జున్, ఆరోహి, సుల్తానా, కీర్తి, ఫైమా అర్హత సాధించారు. అయితే అర్ధరాత్రి అయిపోవడంతో రెండో ఛాలెంజింగ్ టాస్క్ వాయిదా వేయడం జరిగింది. దీంతో ఎవరి బొమ్మలు వారి దగ్గర ఉంచుకోవాలని బిగ్ బాస్ ఇంటి సభ్యులకు తెలియజేశారు. రెండో వారం కెప్టెన్సీ పోటిదారుల బరిలో.. బొమ్మలు పోగొట్టుకోవడంతో రేవంత్, శ్రీ సత్య, అభినయశ్రీ అనర్హులుగా బిగ్ బాస్ తేల్చారు. ఇక్కడితో తొమ్మిదవ రోజు ఎపిసోడ్ ముగిసింది.