Ranveer singh : బాలీవుడ్ మోస్ట్ యాక్టివ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ ఎక్కడ ఉంటే అక్కడ టన్నుల కొద్ది ఫన్ ఉంటుంది. అందుకే ఏ ఈవెంట్ అయినా ఈ బాస్ ను ప్రత్యేకంగా ఆహ్వానిస్తుంటారు నిర్వాహకులు. మూవీ ప్రమోషన్స్ అయినా సినిమా వేడుకలు ఉన్నా నార్త్ నుంచి ఈ మాస్ రాజా రావాల్సిందే. బాలీవుడ్‌లోనే కాదు ఈ మధ్యన ఈ హ్యాండ్‌సమ్ హీరో దక్షిణాదిలో తన క్రేజ్‌ను విపరీతంగా పెంచేసుకుంటున్నాడు. తాజాగా సైమా అవార్డ్స్ 2022 వేడుకలకు హాజరై ఎంటర్‌టైన్మెంట్‌లో తనదైన మార్క్‌ను వదిలాడు రణ్‌వీర్ . యంగ్ హీరోల దగ్గరి నుంచి సీనియర్ నటుల వరకు అందరితో కలిసిపోయి సైమా స్టేజ్ మీద సందడి చేశాడు. మాస్ స్టెప్స్ వేస్తూ డ్యాన్స్‌తో ఇరగదీశాడు. వారితో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఒక్కొక్కరికి ప్రత్యేకంగా క్యాప్షన్‌లను జోడించాడు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

Ranveer singh : సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే బాలీవుడ్ హీరోల్లో రణ్‌వీర్ ఒకరు. ఈ బాస్ నెట్టింట్లో చేసే సందడి మామూలుగా ఉండదు. తన పర్సనల్ విషయాలను, ఫ్యామిలీ అకేషన్స్‌ను, ఫోటో షూట్ పిక్స్‌ను, మూవీ అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడూ పోస్ట్ చేస్తుంటాడు. సోషల్ మీడియాలో తనకు సంబంధించిన విషయాలను పోస్ట్ చేయకుండా ఉండలేనంటాడు రణ్‌వీర్. తాజాగా సైమా వేడుకల్లో దక్షిణాది తారలతోనూ విభిన్న స్టైల్స్‌లో ఫోటోలు దిగి వాటిని ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు . రణ్‌వీర్ ప్రతి ఫోటోనూ షేర్ చేసి వారికి చక్కటి క్యాప్షన్‌ను చేర్చాడు. ఈ క్యాప్షన్‌ను, ఫోటోలూ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
Ranveer singh : రానా పక్కన కూర్చుని నవ్వుతూ దిగిన ఫోటోకు గుడ్‌టైమ్స్ అని క్యాప్షన్‌ను జోడించాడు రణ్‌వీర్. ఈ పిక్ లో ఇద్దరు హీరోలు తమ హ్యాండ్‌సమ్ లుక్స్‌తో అమ్మాయిల మనసు దోచేసారు.

Ranveer singh : సైమా స్టేజ్ మీద డ్యాన్స్‌లతో ఇరగదీశారు రణ్‌వీర్ , విజయదేవరకొండ ఈ సందర్భంగా దిగిన ఫోటోనూ ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు రణ్‌వీర్. విజయ్‌తో దిగిన ఈ పిక్ కు రౌడీ బాయ్స్ అని క్యాప్షన్‌ను పెట్టాడు. ఇద్దరు రౌడీలను ఒకే ఫోటోలో చూడటంతో ఎంజాయ్ చేయడం ఫ్యాన్స్ వంతైంది.

Ranveer singh : బెంగుళూరులో జరిగిన ఈ వేడుకకు రాఖీ భాయ్ యష్ స్పెషల్ అట్రాక్షన్‌గా నలిచాడు. ఈ సందర్భంగా యష్ తో రణ్‌వీర్ దిగిన స్టిల్‌కు భాయ్ అని క్యాప్షన్ పెట్టాడు. ఈ పిక్‌కు నెట్టింట్లో మంచి రెస్పాన్స్ వచ్చింది.

Ranveer singh : నట విశ్వరూపం కమల్ హాసన్‌తోనూ ఓ ఫోటో దిగాడు రణ్‌వీర్. ఈ పిక్ ను ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. ఈ పిక్ కు క్యాప్షన్‌గా ది ఐకాన్ అని పేర్కొన్నాడు.

అల్లూ అర్జున్‌తో దిగిన పిక్‌కు హార్ట్ సింబల్‌ను జోడించాడు.

మొత్తానికి రణ్‌వీర్ దక్షిణాది తారలపైన తనకున్న ప్రమేను ట్విట్టర్ వేదికగా వ్యక్తపరిచి నెటిజన్ల మనసు దోచేసాడు.