Dance Ikon: బుల్లితెరపై ఇప్పటికే ఎన్నో డాన్స్ కార్యక్రమాలు ప్రసారమవుతు ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేశాయి. అయితే మొట్టమొదటిసారిగా ఆహా ఓటీటీ వేదికగా డాన్స్ ఐకాన్ అనే డాన్స్ షో ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ కార్యక్రమానికి ఓంకార్ వ్యాఖ్యాతగా వ్యవహరించగా శేఖర్ మాస్టర్ రమ్యకృష్ణ న్యాయ నిర్ణయితలుగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ కార్యక్రమంలో ముగ్గురు కో ట్రైనర్స్ పాల్గొనబోతున్నారు.
వీరిలో యాంకర్ శ్రీముఖి ఒకరు.
ఇకపోతే తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ఓ ప్రోమో విడుదల కాగా ఈ ప్రోమోలో భాగంగా అరుంధతి అనే కంటెస్టెంట్ చేసిన పర్ఫామెన్స్ పై శ్రీముఖి రమ్యకృష్ణ మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ క్రమంలోనే శ్రీముఖి మాట్లాడుతూ 14 లక్షల విలువ గల ఒక డాన్స్ పెర్ఫార్మెన్స్ మీరు చూడబోతున్నారని నేను మాటిస్తున్నాను అంటూ గట్టిగా చెప్పారు.
ఈ విధంగా కంటెస్టెంట్ పర్ఫామెన్స్ గురించి శ్రీముఖి చాలా కాన్ఫిడెంట్ గా చెప్పడంతో వెంటనే రమ్యకృష్ణ మాట్లాడుతూ.. మేము చూసి చెప్తాం లే అంటూ శ్రీముఖి మాటకు కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలోనే కంటెస్టెంట్ స్వింగ్ జర సింగ్ జరా అనే పాటతో స్టేజిపై చేసిన పర్ఫామెన్స్ చూసినటువంటి రమ్యకృష్ణ ఒక్కసారిగా షాక్ అయ్యారు.
Dance Ikon: పోటా పోటీగా పెర్ఫార్మెన్స్ చేసిన కంటెస్టెంట్స్…
ఇలా కంటెస్టెంట్ పర్ఫామెన్స్ చూసిన అనంతరం రమ్యకృష్ణ మాట్లాడుతూ 14 లక్షలు ఏంటి అంతకన్నా ఎక్కువ విలువ చేస్తుంది అంటూ కంటెస్టెంట్ అరుంధతి పర్ఫామెన్స్ పై ప్రశంసలు కురిపించారు.ఇక ఈ ప్రోమో లో భాగంగా పలువురు కంటెస్టెంట్లు కూడా నువ్వా నేనా అన్నట్టు పోటీ పడుతూ డాన్స్ చేశారు. మొత్తానికి ఈ డాన్స్ ఐకాన్ షో ప్రతి ఒక్కరిని ఎంతగానో ఎంటర్టైన్ చేస్తుందని చెప్పాలి. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.