Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సమంత ప్రస్తుతం పలు సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.ఈ క్రమంలోనే ఇప్పటికే ఈమె నటించిన మొట్టమొదటి పౌరాణిక చిత్రం శాకుంతలం సినిమా విడుదల కావాల్సి ఉంది. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇది కాకుండా ఈమె యశోద, ఖుషి సినిమా షూటింగ్లలో కూడా పాల్గొనబోతున్నారు.
ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి సమంత తాజాగా అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. గత కొంతకాలం నుంచి సోషల్ మీడియాకు దూరంగా ఉన్నటువంటి సమంత గురించి ఎన్నో వార్తలు వైరల్ అయ్యాయి. ఈమె ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోవడం వల్ల సోషల్ మీడియాకు దూరంగా ఉందని, అందుకే సమంత ప్రత్యేక పూజలు హోమాలు చేస్తున్నారంటూ వార్తలు వినిపించాయి.
ఇకపోతే గత రెండు రోజుల క్రితం ఈమె సికింద్రాబాద్లోని ఒక వేద పాఠశాలలో వేద పండితుల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించిందని పూజలకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇకపోతే తాజాగా ఈమె ఆ వేద పాఠశాలకు భారీగా విరాళాలు ప్రకటిస్తున్నారని సమాచారం. ఇలా గురుకుల పాఠశాలకు విరాళం ప్రకటించడమే కాకుండా ఆవులను కూడా విరాళంగా ప్రకటిస్తున్నట్లు తెలుస్తోంది.
Samantha: సమంత విషయంలో ఏం జరుగుతోంది…
ఈ విధంగా సమంత ఉన్నఫలంగా పూజా కార్యక్రమాలను హోమాలను చేయడమే కాకుండా పెద్ద మొత్తంలో విరాళాలను ప్రకటించడంతో చాలామంది అసలు సమంతలో ఏంటి ఈ మార్పులు..ఈమె సోషల్ మీడియాకు దూరంగా ఉండి ఇలా పూజా కార్యక్రమాలలో పాల్గొనడం వెనుక ఉన్న కారణం ఏంటి.. అసలు ఏం జరుగుతోంది అంటూ అభిమానులు ఆరా తీస్తున్నారు.మొత్తానికి సమంత ఇలా సోషల్ మీడియాకు దూరంగా ఉండడంతో ఎంతోమంది ఎన్నో సందేహాలను వ్యక్తపరుస్తున్నారు.