Aravind Kejriwal : గుజరాత్‌పై పలు పార్టీలు దృష్టి సారించాయి. ప్రధాని సొంత గడ్డ అయిన గుజరాత్‌లో ఎలాగైనా పాగా వేసి ప్రధానికి ఝలక్ ఇవ్వాలనే యోచనలో పార్టీలున్నాయి. ఈ క్రమంలోనే ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సైతం గుజరాత్‌పై గురి పెట్టారు. ఈ క్రమంలోనే నిన్న అహ్మదాబాద్‌లో ఆటోవాలాలతో సమవేశం అయ్యారు. ఈ క్రమంలోనే విక్రమ్ అనే ఆటోవాలా తన ఇంటికి నైట్ డిన్నర్‌కి వస్తారా? అని కేజ్రీవాల్‌ను అడిగాడు. ‘‘నేను మీ అభిమానిని. పంజాబ్‌లో ఆటో డ్రైవర్ ఇంట్లో మీరు భోంచేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో చూశా. మా ఇంట్లో భోజనానికి వస్తారా?’’ అని అడిగాడు. దీంతో కేజ్రీవాల్ క్షణం కూడా ఆలోచించకుండా వస్తానని చెప్పారు.
అయితే రాత్రి 8 గంటలకు తానుండే హోటల్‌కు వచ్చి అతని ఆటోలోనే తనను వాళ్ల ఇంటికి తీసుకెళ్లాలని చెప్పారు. దీనికి విక్రమ్ సరే అన్నాడు. చెప్పిన ప్రకారమే విక్రమ్ రాత్రి 8 గంటల కల్లా కేజ్రీవాల్ బస చేసిన హోటల్ ముందు ఉన్నాడు. కేజ్రీవాల్ సైతం తాను ఇచ్చిన మాట ప్రకారమే.. ఆటోలో వాళ్ల ఇంటికి బయలుదేరారు. అయితే అతని ఇంటికి వెళ్లే క్రమంలో భారీ హైడ్రామా నడిచింది. చివరకు కేజ్రీవాల్ తగ్గకపోవడంతో.. పోలీసులే వెనక్కి తగ్గారు. అయితే ఈ ఎపిసోడ్‌లో కాసేపు ఉత్కంఠ నెలకొంది. కేజ్రీవాల్ ప్రయాణిస్తున్న ఆటోను సెక్యూరిటీ కారణాల దృష్ట్యా అహ్మదాబాద్ పోలీసులు అడ్డుకున్నారు.
Aravind Kejriwal : రెండు పోలీసు వాహనాలు ఆటోను అనుసరించాయి..
ఆ ప్రయాణానికి అంగీకరించబోమని పోలీసులు తెలిపారు. కేజ్రీవాల్ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. కాసేపు పోలీసులతో ఆయన వాగ్వాదానికి దిగారు. చివరకు.. ఓ కానిస్టేబుల్ ఆ ఆటో డ్రైవర్ పక్కన కూర్చోగా, రెండు పోలీసు వాహనాలు ఆ ఆటోను విక్రమ్ ఇల్లు ఉన్న ఘాట్లోడియా వరకు అనుసరించాయి. ఇక.. ఇదంతా నాటకమని, కేజ్రీవాల్ గొప్ప నటుడని గుజరాత్ మంత్రి హర్ష సంఘ్వీ విమర్శించారు. మొత్తానికి కేజ్రీవాల్ విక్రమ్ ఇంటికి వెళ్లి భోజనం చేసి అతనితో పాటు అతని కుటుంబ సభ్యులను ఆనందంలో ముంచెత్తారు. కాగా.. పంజాబ్‌లో సైతం ఇలాగే కేజ్రీవాల్ ఓ ఆటావాలా ఇంటికెళ్లి అద్భుతమైన విజయం సాధించారు. మరి గుజరాత్‌లో ఈ సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందో కాదో వేచి చూడాలి.