Cm Jagan: నవంబర్ లో కేబినెట్ ప్రక్షాళన ఉంటుందనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. అదే జరిగితే ఎవరికి ఉద్వాసన లభిస్తుందనే దానిపై వైసీపీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. జగన్ సంకేతాలతో మంత్రుల్లో టెన్షన్ మొదలైంది. తమ పదవి ఊస్ట్ అవుతుందేమోనని జంకుతున్నారు. ఈ లిస్ట్ లో రాయలసీమకు చెందిన డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఉ న్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ ఆయన పట్ల సానుకూల లేదు. పార్టీలోనూ ఆయనకు వ్యతిరేకంగా చాలామంది పనిచేస్తుండటంతో సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇక ప్రతిపక్షాలకు కౌంటర్లు ఇవ్వడంలో వెనుక బడిన ఆయన.. సొంత పార్టీపైనే విమర్శలు చేస్తుండటంతో ఆయన మంత్రి పదవి పోవడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది.
తాజాగా నారాయణస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీలోనే తనపై కుట్ర జరుగుతోందని వ్యాఖ్యానించారు. గంగాధర్ నెల్లూరుతో పాటు పెనుమూరు, వెదురుకుప్పం, ఎస్ఆర్ పురం, కార్వేటినగరం మండలాల్లో వైసీపీ నేతల మధ్య విబేధాలు కామన్ అయిపోయాయి. పంచాయతీ ఎన్నికల తర్వాత అవి మరింత ఎక్కువైపోయాయి. నేతలకు నారాయణస్వామి ఎన్నిసార్లు చెప్పినా మారడం లేదు. ప్రభుత్వ ఎన్ఆర్ఐ సలహాదారుల మహాసముద్రం జ్ఝానేంద్రరెడ్డి, డిప్యూటీ సీఎం నారాయణస్వామి హధ్య అంతర్గత విబేధాలు మరింత రెచ్చకెక్కాయి. ఇటీవల పార్టీ మండల కమిటీ అధ్యక్షుల నియామకం విషయంల ోఅవి బయటపడ్డాయి. జ్జానేంద్రరెడ్డి సొంత మండలం పెనుమూరు పార్టీ అధ్యక్షుడిగా తన బావమరిదిని పెట్టాలని జ్ఝానేంద్రరెడ్డి భావించారు.
Cm Jagan:
కానీ నారాయణస్వామి ఇంకోకరికి అవకాశం ఇచ్చారు. అయితే నియోజకవర్గంలోని నేతలందరూ పెనుమురూలో సమావేశం కావావాలని నిర్ణయించారు. నారాయణస్వామికి వ్యతిరేకంగా ఈ సమావేశం నిర్వహించారు. దీంతో ఇది తెలుసుకన్న నారాయణస్వామి పార్టీలో తనపై కుట్ర జరుగుతోందని వ్యాఖ్యానించారు. నియోజకవర్గంలోని అసమ్మతి నేతల అంశం ఆయనకు తలనొప్పిగా మారింది. అయినా బహిరంగంగా పార్టీలోని నేతలపై అసంతృప్తి వ్యక్తం చేయడంపై వైసీపీ అధిష్టానం ఆయనపై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయనపై వేటు పడటం ఖాయమని చెబుతున్నారు.