సీనియర్ స్టార్ హీరో బాలకృష్ణ అఖండ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత గోపిచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతుంది. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలయ్య బాబు డ్యూయల్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో తండ్రి కొడుకులుగానే బాలయ్యబాబు నటిస్తున్నారు. ఈ ఫార్ములా బాలకృష్ణకి సక్సెస్ అందిస్తూ ఉండటంతో దీనినే గోపిచంద్ మలినేని కూడా నమ్ముకున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈమెతో పాటు మలయాళీ హీరోయిన్ హానీ రోజ్ కూడా ఒక హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.
అయితే హానీ రోజ్ ఈ మూవీలో ఎలాంటి పాత్రలో కనిపిస్తుంది అనే సందేహం అందరిలో ఉంది. ఈ మలయాళీ బ్యూటీ ఇది వరకు తెలుగులో వరుణ్ సందేశ్ హీరోగా వచ్చిన ఈ వర్షం సాక్షిగా మూవీలో ఒక హీరోయిన్ గా నటించింది. ఆ తరువాత బాలయ్య సినిమాలో నటించడమే. ఈమె మెజారిటీగా మలయాళీ సినిమాలే చేసింది. ఇదిలా ఉంటే కృష్ణం రాజు మృతికి బాలయ్య బాబు తన షూటింగ్ ఆపేసిన సంగతి తెలిసిందే. అయితే కృష్ణంరాజు మృతదేహాన్ని చూసేందుకు రాలేని పరిస్థితిలో ఉండటంతో చిత్ర యూనిట్ మొత్తం అతనికి నివాళి అర్పించి మళ్ళీ షూటింగ్ స్టార్ట్ చేశారు.
ఇందులో మలయాళీ బ్యూటీ హానీ రోజ్ స్టైల్ బయటకొచ్చింది. ఆమె మెరిసిన జుట్టుతో, నిండుగా ప్లెయిన్ చీర కట్టుకొని వయస్సు మళ్ళీన పాత్రలో కనిపిస్తుంది. దీనిని బట్టి హానీ రోజ్ సీనియర్ బాలకృష్ణకి జోడీగా ఈ మూవీలో కనిపిస్తుందని తెలుస్తుంది. ఇక సీనియర్ బాలయ్యకి జోడీగా, బాలకృష్ణ తల్లిగా ఆమె పాత్ర ఉండబోతుందని అర్ధమవుతుంది. తెలుగులో ఇలాంటి పాత్ర ద్వారా ఆమె నటిగా ప్రూవ్ చేసుకొని ఏ మేరకు సక్సెస్ అవుతుందనేది వేచి చూడాలి. ఇదిలా ఉంటే బాలయ్య, అనిల్ రావిపూడి నెక్స్ట్ మూవీ కూడా నెల రోజుల తర్వాత ప్రారంభమయ్యే అవకాశం ఉందనే మాట వినిపిస్తుంది.