Bigg Boss 6: “ORMAX” మ్యాగజిన్ సర్వే సంస్థ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాలీవుడ్ మొదలుకొని సౌత్ ఫిలిం ఇండస్ట్రీ వరకు అనేక సర్వేలు నిర్వహిస్తూ ఉంటది. ప్రతి నెల వివిధ ఇండస్ట్రీలకు చెందిన హీరోలు.. మరియు హీరోయిన్ లు ఎవరు టాప్ లో ఉన్నారు.. అనేది జనాల నాడి ఆధారం చేసుకుని ర్యాంకింగ్ ఇస్తూ ఉంటది. ఒక్క సినిమా రంగానికి మాత్రమే కాదు దేశంలో పలు పేరుగాంచిన క్రీడరంగం.. ఇంకా అనేక రంగాలకు సంబంధించి ర్యాంకింగ్స్ “ORMAX” సంస్థ ప్రకటిస్తది.
కాగా ఇప్పుడు తాజాగా బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ ల విషయంలో”ORMAX” సర్వే సంస్థ ర్యాంకింగ్స్ ప్రకటించింది. మోస్ట్ పాపులర్ బిగ్ బాస్ సీజన్ సిక్స్ తెలుగు కాంటెస్ట్ అని “ORMAX”.. సంస్థ ఐదుగురికి ర్యాంకింగ్స్ తెలియజేసింది. మొదటి ర్యాంకులో రేవంత్, రెండో ర్యాంక్ శ్రీ హాన్, మూడో స్థానంలో ఆది రెడ్డి, నాలుగో స్థానంలో చంటి ఇంకా ఐదో స్థానంలో నేహా చౌదరి ఉన్నట్లు ప్రకటన చేయడం జరిగింది.
బిగ్ బాస్ సీజన్ సిక్స్ స్టార్ట్ అయ్యి వారం రోజులు అయింది. ప్రస్తుతం రెండో వారం కొనసాగుతుంది. ఓటింగ్ పరంగా ఇంకా గేమ్ పరంగా మంచి దూకుడు మీద రేవంత్ రానిస్తూ ఉన్నాడు. మరో పక్క స్లో అండ్ స్టడీ అన్న తరహాలో శ్రీహాన్ ఆట తీరు అంది. ఆదిరెడ్డి హౌస్ లో ఏది చేసినా పక్కా గేమ్ ప్లాన్ తో ఆడుతున్నాడు. ఇంకా చంటి అదేవిధంగా నేహా చౌదరి సైతం తమదైన శైలిలో రాణిస్తూ ఉన్నారు.
నోట్: బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం rtvmedia.in, Rtv Telugu ని సబ్‌స్క్రైబ్ చెయ్యండి!