Bigg Boss Season 6 Day 8 Highlights: బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టాక ఎదుర్కొనే కష్టాలలో ఒకటి ఆకలి. చాలామంది కంటెస్టెంట్లు అనేక సీజన్లలో ఫుడ్ విషయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న సన్నివేశాలను … మనం చూశాం. సీజన్ ఫైవ్ లో లోబో చెత్త బుట్టలో ఏదైనా ఫుడ్ ఐటమ్ ఉంటుందేమో అని.. వెతుక్కుని తినటానికి కూడా రెడీ అయిపోయాడు. అంతలా హౌస్ లో ఆకలి కష్టాలు.. ఇంటి సభ్యులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పటికే సీజన్ సిక్స్ లో ఆదిరెడ్డి.. ఫుడ్ తనకి సరిపోవటం లేదని తెలిపారు.

శ్రీ సత్య కూడా.. తనకి ఆకలి ఎక్కువ అని ఆదివారం ఎపిసోడ్ లో నాగార్జునకి తెలియజేసింది. ఈ క్రమంలో సోమవారం జరిగిన ఎపిసోడ్ లో అర్ధరాత్రి కిచెన్ లో నలుగురు కంటెస్టెంట్ లు.. ఎవరికి తెలియకుండా ఫుడ్ ఐటమ్స్ చేసుకున్నారు. వాళ్ళు ఎవరంటే సూర్య, పైమా, ఆరోహి, రాజ్. ముందుగా ఈ నలుగురిలో సూర్య, ఫైమా.. కొన్ని ఐటమ్స్ తీసుకుని.. కట్ చేసి స్టవ్ పై కాకుండా..ఓవెన్ లో వేడి చేయటం జరిగింది.
అనంతరం ఇద్దరితో పాటు ఆరోహి అదేవిధంగా రాజ్ వచ్చి తినడం జరిగింది. రెండో వారం స్టార్టింగ్ లోనే ఈ రకంగా హౌస్ లో.. కిచెన్ లో దొంగతనంకి పాల్పడటంతో రానున్న రోజుల్లో ఇంకా ఆకలి రాజ్యమే అని సోమవారం ఎపిసోడ్ తర్వాత.. ఆడియన్స్ అంటున్నారు. దాదాపు హౌస్ లో 21 మంది సభ్యులు ఉన్నారు. చాలామంది ఫుడ్ సరిపోక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే విషయాన్ని నాగార్జున దృష్టికి కూడా హౌస్ మేట్స్ తీసుకెళ్లడం జరిగింది.