Pragya Jaiswal: టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మొదటి కంచె సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత ఓం నమో వెంకటేశాయ, గుంటూరోడు,నక్షత్రం,జయ జానకి నాయక,ఆచారి అమెరికా యాత్ర, సైరా వంటి సినిమాలలో నటించినప్పటికీ ఆమెకు తగిన విధంగా గుర్తింపు దక్కలేదు.
ఇక గత ఏడాది విడుదల అయిన అఖండ సినిమాతో చివరగా ప్రేక్షకులను పలకరించింది ఈ ముద్దుగుమ్మ. అఖండ సినిమా ద్వారా సూపర్ హిట్ టాక్ ను తన ఖాతాలో వేసుకుంది. అఖండ సినిమాతో ఒక్కసారిగా ఊహించని పాపులారిటీని సంపాదించుకుంది ప్రగ్యా జైస్వాల్. కాగా అంతకు ముందు కొన్ని సినిమాలలో నటించిన రాని గుర్తింపు ఈ ఒక్క సినిమాతో దక్కించుకుంది.
కాగా అఖండ సినిమా డిసెంబర్ 2, 2021 లో ప్రపంచ వ్యాప్తంగా విడుదలై మంచి వసూళ్లను రాబట్టి విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా తర్వాత ప్రగ్యాకు మళ్ళీ వరుసగా అవకాశాలు వస్తాయి అని అందరూ భావించారు. అయితే అవకాశాల మాట అటు ఉంచితే అందంతో నెటిజెన్స్ ని, అభిమానులని కట్టిపడేస్తోంది.
తన హాట్ ఫోటో షూట్ లతో పిచ్చెక్కిస్తోంది. ప్రగ్యా జైస్వాల్ సంప్రదాయ చీరకట్టులో అయినా, ఫ్యాషన్ అవుట్ పిట్ లో అయినా కూడా మెరుస్తూ తన అందంతో యూత్ ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇక అఖండ సినిమా తరువాత సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ గా ఉంటూ తన అందాన్ని రోజురోజుకీ పెంచుకుంటోంది.
అంతేకాకుండా తనను ఫాలో అయ్యే వారి సంఖ్య కూడా అంతకంతకు పెంచుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇలా ఉంటే తాజాగా తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియోని పోస్ట్ చేసింది. ఆ వీడియోలో ప్రగ్యా జైస్వాల్ ఉల్లి పొర లాంటి చీరను ధరించింది. అంతేకాకుండా తన కురులతో మన్మధ బాణాలు గుచ్చే విధంగా తన చూపులతో మత్తెక్కిస్తోంది.
View this post on Instagram
అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోని చూసిన నెటిజన్స్ ఆమె అందానికి ఫిదా అవుతున్నారు.