Biggboss 6 : ఏం బిగ్‌బాస్ హౌస్‌రా బాబోయ్.. ఎవరికి వారు తగ్గేదేలే అన్నట్టుగా ముందుకెళుతున్నారు. 21 మందిలో ఐదారుగురు మినహా అంతా వాయిస్ పరంగా.. ఇతర విషయాల్లోనూ కాస్త గట్టిగానే వాయిస్ వినిపిస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్‌కి అడ్డా ఫిక్స్ అని ఏ ముహూర్తాన నాగార్జున అన్నాడో కానీ హౌస్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ మామూలుగా లేదు. సీజన్ ప్రారంభమైన మొదటి రోజు నుంచే అలకలు, గొడవలతో ఆడియెన్స్‌కి కావాల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్. గత వారం బుధవారం నామినేషన్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తే ఈ వారం బిగ్‌బాస్ తిరిగి ఎప్పటిలాగే సోమవారం నామినేషన్స్ కార్యక్రమాన్ని నిర్వహించాడు.
అయితే గత సీజన్‌లకు ఈ సీజన్‌కు ఒక మార్పు ఉంది. గత సీజన్‌లలో ఒక్కొక్కరికీ ఇద్దరిని నామినేట్ చేసే అవకాశం ఉంటే.. ఈసారి మాత్రం గత సీజన్‌లతో పోలిస్తే నామినేషన్ ప్రక్రియలో మార్పులు చేసిన బిగ్‌బాస్ ఈసారి ఇంటిసభ్యులకు నామినేట్ చేయడానకి ఒక ఓటు మాత్రమే లభిస్తుందని ఆదేశించాడు. దీంతో అసలు రచ్చ మొదలైంది. ఈసారి ఆదిరెడ్డి వర్సెస్ ఆరోహి కాస్త గట్టిగానే ఆర్గ్యుమెంట్ జరిగినట్టు తెలుస్తోంది. హౌస్‌లో అందరితో ర్యాపో ఉంది కానీ మీతో లేదు అంటూ ఆరోహి ఆదిరెడ్డిని నామినేట్ చేసింది. దీనికి కౌంటర్‌గా ఇంట్లో గేమ్ ఆడనివాళ్లు వెళ్లిపోవాలా లేక నీతో ర్యాపో లేదని వెళ్లిపోవాలా అని ఎదురు ప్రశ్న విసిరాడు.
Biggboss 6 : అందరికీ ఒక బుర్ర పని చేస్తే వారికి రెండు బుర్రలు పని చేస్తాయి..
ఆట విషయంలో కూడా మీకంటే బెటర్‌గానే ఆడుతున్నానంటూ ఆదిరెడ్డి పేర్కొనగా ఆరోహి ఆశ్చర్యం వ్యక్తం చేసింది. దీనికి ఏం ఇరగదేశారని అంత ఆశ్చర్యపోతున్నారు అంటూ ఆదిరెడ్డి గట్టిగా బదులిచ్చాడు. అందరికీ ఒక బుర్ర పని చేస్తే వారికి రెండు బుర్రలు పని చేస్తాయని.. బిగ్‌బాస్ డెసిషన్‌నే నామినేట్ చేస్తున్నా అంటూ మెరీనా అండ్ రోహిత్‌లను ఆదిరెడ్డి నామినేట్ చేశాడు. అబ్బాయిలకు బుద్ధిలేదు అన్నందుకు గీతూని శ్రీహాన్ నామినేట్ చేశాడు. మరోవైపు రేవంత్-కీర్తి భట్‌ల మధ్య కూడా వాగ్వాదం నడిచింది. ఇక సోషల్ మీడియాలో అందుతున్న సమాచారం ప్రకారం..రేవంత్, శ్రీ సత్య, షానీ, ఫైమా, మెరీనా అండ్ రోహిత్, ఆదిరెడ్డి, గీతూ, అభినయలు నామినేషన్స్‌లో ఉన్నట్లు సమాచారం.