Krishnam Raju : కృష్ణంరాజు అంతిమ యాత్ర కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ఆయన పార్దీవ దేహానికి పోలీసులు గౌరవ వందనం చేశారు. కృష్ణంరాజు అంతిమ యాత్ర రూట్ మ్యాప్‌ను పోలీసులు నేటి ఉదయమే తయారు చేశారు. దాని ప్రకారం.. జూబ్లీహిల్స్ నివాసం నుంచి రోడ్ నెం 45- బిఎన్ఆర్ కాలనీ బ్రిడ్జ్.. గచ్చిబౌలి ఓఆర్ ఆర్ మీదుగా అప్పా జంక్షన్.. అక్కడి నుంచి మొయినాబాద్ – కనకమామిడిలోని ఫామ్ హౌజ్‌కు తరలించనున్నారు. మొయినాబాద్ ఫామ్‌హౌజ్‌లో కృష్ణంరాజు అంత్యక్రియలు జరగనున్నాయి. ప్రభాస్ సోదరుడు ప్రభోద్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగనుంది.
అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులను మాత్రమే అనుమతించనున్నారు. కనకమామిడిలోని సర్వేనెంబర్ 239లో నాలుగేళ్ల కిత్రం కృష్ణంరాజు నాలుగు ఎకరాల సాగుభూమి కొనుగోలు చేశారు. ప్రస్తుతం అక్కడ ఫామ్‌హౌస్ నిర్మాణంలో ఉంది. కృష్ణంరాజుకు ఈ వ్యవసాయ క్షేత్రం ఎంతో ఇష్టమని.. తీరిక దొరికినప్పుడల్లా ఇక్కడికి వచ్చేవారని స్థానికులు తెలిపారు. వచ్చినప్పుడల్లా.. ఈ స్థలం పక్కనే ఉన్న తనస్నేహితుల పామ్‌హౌ్‌సలో ఆయన ఉండేవారని వెల్లడించారు. కరోనా సమయంలోనూ ఈ వ్యవసాయ క్షేత్రానికి సమీప రిసార్టులో నెల రోజుల పాటు కుటుంబంతో కలిసి కృష్ణంరాజు గడిపారు.
Krishnam Raju : ‘చిలక గోరింక’ సినిమాతో వెండితెరకు పరిచయం
చదువు పూర్తికాగానే కొన్నాళ్లు కృష్ణంరాజు జర్నలిస్ట్‌గా పనిచేశారు. మరికొన్నాళ్లపాటు ఒక ఫొటో స్టూడియో నడిపారు. ఇరవై ఆరేళ్ల వయసులో.. అంటే 1966లో ఆయన సినీ ప్రస్థానం ప్రారంభమైంది. ఆ ఏడాది తొలిసారి ‘చిలక గోరింక’ సినిమాతో వెండితెరకు కృష్ణంరాజు పరిచయం అయ్యారు. అమరదీపం, బొబ్బిలి బ్రహ్మన్న చిత్రాల్లో నటనకుగాను.. 1977, 1984 సంవత్సరాల్లో నంది పురస్కారాలను గెలుచుకున్నారు. జైలర్‌గారబ్బాయి సినిమాలో నటనకు బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా నంది పురస్కారాన్ని అందుకున్నారు. ‘తాండ్రపాపారాయుడు’ చిత్రంలో నటనకుగాను.. ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు. అమరదీపం, మన ఊరి పాండవులు చిత్రాల్లో నటనకుగాను రాష్ట్రపతి పురస్కారం అందుకున్నారు. 2014లో రఘుపతి వెంకయ్య పురస్కారం అందుకున్నారు.