Intinti Gruhalakshmi: స్టార్ మా లో ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈరోజు సెప్టెంబర్ 12వ తేదీ ఎపిసోడ్ లో జరిగే హైలెట్స్ ఏంటో చూద్దాం.
ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలో నందు, లాస్యలను సతీ సమేతంగా కూర్చుని పూజ చేసుకోమంటుంది తులసి. తర్వాత లాస్య, హనీతో సామ్రాట్ గారూ రాలేదా అంటే వచ్చారు బయట కారులో ఉన్నారు అంటుంది. అప్పుడు తులసి బయటకు వచ్చి ఇంటిదాకా వచ్చి బయటే నిలబడిపోయారా అంటే ఏ హక్కుతో రావాలో నాకు అర్థం కాలేదు మీరు నాకు కంపెనీలో ఎంప్లాయ్ కాదు, బిజినెస్ పార్టనర్ కూడా కాదు అంటే దానికి తులసి మీరు మనసులో ఏదో పెట్టుకుని మాట్లాడుతున్నారు అంటుంది.
అలా ఏం కాదు ఏదో చెప్పాలి అని చెప్పాను అంటాడు. మీ ఇంట్లో, మీ జీవితంలో, మీ నిర్ణయాలు మీవీ చెప్పాల్సిన అవసరం లేదు అంటాడు. ఏదైనా మెసేజ్ చేయడం కంటే కాసేపు కలిసి మాట్లాడుకుంటేనే బాగుండేది అంటాడు సామ్రాట్. ఒక్కోసారి మన చుట్టూ ఉన్న పరిస్థితులు మన ప్రవర్తనలో మార్పులు తెస్తాయి అంటే అతి మంచితనం, త్యాగం అనేవి మితిమీరితే బాగుండదు దీనికి మీరేమంటారు అంటాడు. తర్వాత సామ్రాట్ ఇలాంటి నిర్ణయాల వల్ల జీవితాలు తారుమారా అయితాయని మీకు ఎప్పుడూ అనిపించలేదా అని ప్రశ్నిస్తాడు.
అప్పుడు తులసి నా నష్టం ఇతరులకు లాభం చేకూరుస్తుందంటే సంతోషపడతాను అంతే అంటుంది. దానికి సామ్రాట్ దీనిని పిచ్చితనం అంటారు. తర్వాత నాకు ఏదైనా చెప్పాలి అని అనుకుంటున్నారా, మీ మనసులో ఉన్న విషయాలు ఏమైనా దాగి ఉంటే, అప్పుడు తులసి తర్వాత మాట్లాడుకుందాం దయచేసి లోపలికి రండి అంటూ కాస్త నవ్వండి ఖర్చు ఏమవదు అంటుంది. ఇదంతా చూస్తూ లాస్య, నందుతో కామెంట్లు చేస్తుంది. అందరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉండగా మా మామ్ కు సారీ చెప్పి పూజలు కూర్చోండి అని అభి అంటూ ఉండగా ఇది మా వ్యక్తిగత విషయం ఇందులో ఎవరి జోక్యం అవసరం లేదు అంటుంది తులసి.
మరోవైపు లాస్య, నందుతో కామెంట్ చేస్తూనే ఉంటుంది. పూజారి భార్యాభర్తలు అందరూ కంకణాలు కట్టుకోండి అంటే అందరూ కట్టుకున్న తర్వాత తులసి కంకణం తీసుకుని సామ్రాట్ వద్దకు వెళ్తే అందరూ ఆశ్చర్యపోతారు. తులసి ఆ కంకణాన్ని హనీతో సామ్రాకు కట్టిస్తుంది. తరువాత హనీ, తులసికి కూడా కంకణం కడుతుంది. ఇదంతా చిరాకుగా చూస్తున్న నందుకు మరోవైపు లాస్య తన మాటలతో మరింత చిరాకు తెస్తూ తెప్పిస్తుంది. తర్వాత పూజారి పూజ అనంతరం పెద్దల ఆశీర్వాదం తీసుకోమంటే అందరూ తీసుకుంటారు కానీ ప్రేమ తండ్రి వద్ద తీసుకోవడానికి నిరాకరిస్తాడు అప్పుడు సామ్రాట్ తీసుకోవచ్చు కదా, మీ అమ్మ మీ నాన్నను గౌరవిస్తుంది మీరు కూడా చేయొచ్చు కదా అంటూ సారీ మీ ఫ్యామిలీ విషయంలో మాట్లాడుతున్నందుకు అంటాడు. అప్పుడు ప్రేమ్ పర్లేదు సార్ అంటాడు.
Intinti Gruhalakshmi:
తర్వాత సన్నివేశంలో తులసి, అంకిత, శృతిలతో ప్రసాదాల సంగతి చూడండి అంటుంది. తర్వాత పరంధామయ్య, లక్కీ తో ఒక పది గుంజీలు తీస్తే చదువు బాగా వస్తుంది అంటాడు. తరువాత చదవాల్సిన అవసరం ఉండదా తాతయ్య అంటే అందరూ నవ్వుకుంటారు మీరు కూడా చిన్నప్పుడు 10 గుంజీలు తీసి ఉంటే భారం తప్పేది, ఈ బరువు మోయాల్సిన అవసరం ఉండదు అంటే అందరూ నవ్వుకుంటారు ఇంతటితో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే రేపటి దాకా వేచి చూడాల్సిందే.