సెలబ్రెటీలు అందరూ కలర్ ఫుల్ లైఫ్ లో బ్రతుకుతూ ఉంటారు. అలా అని వారి జీవితాలు ఏమీ అద్భుతంగా ఉండవు. వ్యక్తిగత జీవితంలో వారికి కూడా ఒడిదుడుకులు ఉంటాయి. సమస్యలు ఉంటాయి. ఆర్ధిక ఇబ్బందులు ఉంటాయి. ఎలాంటి ఇబ్బందులు ఉన్న కూడా తెరపై కనిపించే సమయంలో ఆ పాత్రకి తగ్గట్లుగానే ప్రవర్తించాలి. అయితే బయట నుంచి చూస్తున్నవారు మాత్రం సినిమా నటులకి ఏం కష్టాలు ఉంటాయి అని సింపుల్ గా తేల్చేస్తారు. ఈ విషయంలో ఎవరూ అతీతులు కాదని కొంత మంది న నటీమణుల రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఉదాహరణగా ఉంటాయి.
వ్యక్తిగత జీవితంలో వారికి ఎదురయ్యే అనుభవాల నేపధ్యంలో అలంటి ఇబ్బందులు తమ పిల్లలు పడకూడదని కఠిన నిర్ణయాలు తీసుకుంటారు. ఈ విషయంలో బాలీవుడ్ నటి, బిగ్ బాస్ మాజీ కంటిస్టెంట్ శ్వేతా తివారి కూడా తన కూతురుకి పెళ్లి చేసే ఆలోచన తనకి లేదని సంచలన వ్యాఖ్యలు చేసింది. దీనికి కారణాలు కూడా ఆమె చెప్పింది. పెళ్లి చేసుకుంటే మగాడి కోపాన్ని, ద్వేషాన్ని భరించాల్సి వస్తుందని, తన జీవితంలో నా భర్త నాకు పెట్టిన వేధింపులని నా కూతురు చిన్న వయస్సు నుంచే చూస్తూ పెరిగిందని చెప్పుకొచ్చింది.
పెళ్లి చేసుకుంటే ఎదురయ్యే పరిణామాలు ఎలా ఉంటాయో తనకి స్పష్టంగా అర్థమైందని, అందుకే తనకి పెళ్లి చేయాలనే అభిప్రాయం నాకు లేదని శ్వేతా తివారి చెప్పుకొచ్చింది. ఎవరితో అయినా రిలేషన్ లో ఉన్నంత మాత్రాన పెళ్లి చేసుకోవాలని రూల్ లేదని, అలాగే తన కూతురు ఎవరితో డేటింగ్ చేసిన అభ్యంతరం చెప్పానని కూడా శ్వేతా తివారి చెప్పింది. శ్వేతా తివారి కూతురు పేరు పాలక్ తివారి. టీవీ నటుడు రాజా చౌదరి, శ్వేతా తివారికి పుట్టిన కూతురు ఈమె. శ్వేతా తివారి తన మాజీ భర్త రాజా చౌదరి పెట్టిన వేధింపుల కారణంగానే ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తుంది.
.