Bigg Boss Season 6 Day 7 Highlights: తెలుగు బిగ్ బాస్ షోలో ఇప్పటివరకు దాదాపు 5 సీజన్ లు కంప్లీట్ అయ్యాయి. అన్నీ కూడా ఒకే ఫార్మేట్ తరహాలో ప్రసారం కావడం జరిగింది. ఫిజికల్ టాస్కులు ఇంకా ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు దాదాపు ప్రతి సీజన్ లో రిపీట్ అయినవే.. తర్వాత సీజన్ లలో ఇంటి సభ్యుల చేత ఆడించేవాళ్లు. ఈ క్రమంలో బిగ్ బాస్ ఆడియన్స్ నుండి కొత్త టాస్కులు పెట్టాలని.. పాత వాటిని రిపీట్ చేయకూడదని డిమాండ్ వినబడేది. అయితే ఎట్టకేలకు ఇప్పుడు సీజన్ సిక్స్ లో కొత్త టాస్క్ తీసుకురావడం జరిగింది.
మేటర్ లోకి వెళ్తే బిగ్ బాస్ సీజన్ సిక్స్ ఆదివారం జరిగిన ఎపిసోడ్ లో.. నాగార్జున కొత్త టాస్క్ ప్రకటించారు. ఈ టాస్క్ ఇకనుండి ప్రతి ఆదివారం ఉంటుందని.. తెలిపారు. “స్టార్ ఆఫ్ ది వీక్” టాస్క్ అని… ప్రతి ఆదివారం జరిగే ఈ టాస్క్ లో గెలిచే కంటెస్టెంట్ కి టైటిల్ తో పాటు గిఫ్ట్ వస్తుందని తెలిపారు. ఈ క్రమంలో ఆదివారం ఎపిసోడ్ లో “స్టార్ ఆఫ్ ది వీక్ టాస్క్” లో బాలాదిత్యా గెలవడం జరిగింది. దీంతో నాగార్జున ఆదిత్యకి గిఫ్ట్ పంపించారు.
చాలా కాలం తర్వాత బిగ్ బాస్ షోలో టాస్కులు పరంగా మార్పులు, ఇంకా ఎలిమినేషన్ పరంగా షాకులు.. చూసే ఆడియన్స్ కి ఇస్తూ ఉండటంతో సీజన్ 6పై కొద్ది కొద్దిగా… చూస్తున్న జనాలకు ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. సీజన్ సిక్స్ స్టార్ట్ అయ్యి ఒక వారం కంప్లీట్ కావడంతో రెండో వారం హౌస్ లో ఎటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయో చూడాలి.