బిగ్ బాస్ సీజన్ 6 మొదటి వారం వీకెండ్ ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా సాగింది. శనివారం హౌస్ లో ఉన్న కంటిస్టెంట్ లు అందరికి ఆటతో పాటు, మాటతీరు, ఇంట్లో బిహేవ్ చేసే విధానం బట్టి హోస్ట్ నాగార్జున క్లాస్ తీసుకున్నారు. ఎవరు ఏ విషయాలలో తమని తాము మార్చుకోవాలి అనే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. అలాగే ఆదివారం ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో షో నడిచింది. మధ్య మధ్యలో ఎలిమినేషన్ జోన్ లో ఉన్న ఒకో కంటిస్టెంట్ ని సేఫ్ చేస్తూ అందరితో ఇంటరెస్టింగ్ గేమ్స్ ని నాగార్జున ఆడించారు. ఇక ఫైనల్ గా ఎలిమినేషన్ లో ఇనాయ, ఆరోహి, అభినయ శ్రీ వచ్చారు.
ఆ సమయంలో హౌస్ లో అందరూ ముగ్గురిలో ఎవరితో మీకు ఇబ్బంది ఉంది అనే ప్రశ్న నాగార్జున వేసినపుడు అందరూ కూడా ఇనాయని పాయింట్ చేశారు. అనవసరంగా అన్ని విషయాలలో తలదూర్చుతుందని కొంత మంది తమ అభిప్రాయాలు చెప్పారు. అయిపోయిన టాపిక్ ని తీసుకొని మళ్ళీ గొడవని స్టార్ట్ చేస్తుందని అన్నారు. ఇలా 14 మంది కంటిస్టెంట్ లు ఇనాయాని టార్గెట్ చేయడంతో ఆమె హౌస్ లోకి వెళ్లి కొద్దీ సేపు బాధపడింది. ఈ తంతు అంతా అయ్యాక ఆ ముగ్గురిలో ఆరోహి సేఫ్ అయినట్లు ప్రకటించారు. ఇక అభినయ శ్రీ, ఇనాయ ని గార్డెన్ ఏరియాలోకి తీసుకొచ్చి వారికి ఎలిమినేషన్ హామర్ ఇచ్చారు.
దీనిని ఎవరు ఎత్తుతారో వారు సేఫ్ జోన్ లో ఉంటారని నాగార్జున చెప్పి టెస్ట్ పెట్టారు. ఇద్దరూ కూడా హామర్ ని ఎత్తడంతో ఇద్దరు సేఫ్ అయినట్లు ప్రకటించారు. మొదటి వారం ఇంకా అందరూ ఒకరిని ఒకరు అర్ధం చేసుకునే స్థాయిలో ఉండటం వలనే ఎలిమినేషన్ లేదని నాగార్జున చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే అభినయశ్రీ, ఇనాయా ఇద్దరూ కూడా గ్లామర్ కంటిస్టెంట్ లు, వారిని మరో నాలుగు, ఐదు వారాలు హౌస్ లో ఉంచాలని బిగ్ బాస్ నిర్ణయించుకోవడంతోనే చివరి నిమషంలో గేమ్ లో ఇలా ట్విస్ట్ ఇచ్చారని అభిప్రాయం వినిపిస్తుంది. లేదంటే అభినయ శ్రీ ఎలిమినేట్ అయ్యి బయటకి వెళ్లిపోయేది అనే మాట వినిపిస్తుంది.