Bigg Boss Season 6 Day 7 Episode Review: బిగ్ బాస్ సీజన్ సిక్స్ ఆదివారం ఎపిసోడ్ లో సరికొత్త ట్విస్ట్ నెలకొంది. గత ఐదు సీజన్లకు భిన్నంగా ఆరో సీజన్ లో ఎవరిని ఎలిమినేట్ చేయకుండా అందరూ సేఫ్ జోన్ లో ఉన్నట్లు నాగార్జున ప్రకటించడం ఎపిసోడ్ మొత్తానికి హైలైట్ అయింది. ఎపిసోడ్ స్టార్టింగ్ నుండి చూస్తే.. యధావిధిగా సాంగు తో ఎంట్రీ ఇచ్చిన నాగార్జున ఇంటి సభ్యులందరితో ముచ్చటించారు. ఈ క్రమంలో “ఎవరికి ఎంత తెలుసు” అనే టాస్క్ పెట్టడం జరిగింది. ఈ టాస్క్ లో గెలిచినవారు “స్టార్ ఆఫ్ ద వీక్” గా టైటిల్ తో పాటు గిఫ్ట్ అందుకుంటారని నాగార్జున తెలియజేశారు. అయితే ఈ టాస్క్ లో కెప్టెన్ బాలాదిత్య గెలవడం జరిగింది. ఇంటి సభ్యులకు సంబంధించి వేసిన చాలా ప్రశ్నలకు బాలాదిత్య సమాధానాలు ఇచ్చారు. అర్జున్ కళ్యాణ్ సైతం మంచి పోటీ ఇచ్చారు. కాని చివర ఆఖరికి ఆదిత్య గెలవడం జరిగింది. దీంతో బాలాదిత్య “స్టార్ ఆఫ్ ద వీక్” టైటిల్ తో పాటు గిఫ్ట్ అందుకున్నారు.
గత 5 సీజన్లలో ఎప్పుడూ కూడా ఇటువంటి టాస్క్ పెట్టలేదు. ఫస్ట్ టైం “స్టార్ ఆఫ్ ద వీక్” సీజన్ సిక్స్ లో పెట్టినట్లు నాగార్జున తెలియజేశారు. అంతేకాదు ప్రతి ఆదివారం ఈ గేమ్ ఉంటుందని గిఫ్ట్ కూడా ఇస్తారని పేర్కొన్నారు. అనంతరం ఇంటి సభ్యులందరికీ.. “ఐటెం నెంబర్ అనే టాస్క్” పెట్టారు. ఐటెం సాంగులకు సంబంధించి వస్తువులు చూపించి.. కనిపెట్టాలని నాగార్జున తెలియజేయడం జరిగింది. ఎవరైతే కనిపెడతారో ఆ గ్రూపు ఆ పాటకి డ్యాన్స్ చేయాలని తెలిపారు. దీంతో ఇంటి సభ్యులను రెండు గ్రూపులుగా విభజించారు. Aటీిం అదేవిధంగా B టీింగా విభజించారు. A టీం నుండి మొదట రౌండ్ లో రేవంత్.. రాగా B టీం నుండి శ్రీహాన్ రావటం జరిగింది. ఇద్దరూ పోటీ పడగా చాలావాటికి రేవంత్ పాటలు కనిపెట్టడంతో.. మొదటి రౌండ్ లో A టీం గెలిచింది. ఆ తర్వాత డేంజర్ జోన్ లో ఉన్న ఐదుగురిలో ఫైమా సేఫ్ జోన్ లో ఉన్నట్లు నాగార్జున ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత కొత్త కెప్టెన్ బాలాదిత్యా నీ ఇంటిలో ఉన్న ఆడవాళ్లను ఒక్కొక్కరిని వర్ణించాలని నాగార్జున తెలియజేశారు. దీంతో మెరీనా బుట్ట బొమ్మలా ఉంటుందని అన్నాడు. ఫైమా చూస్తాకి ఫ్లవర్ లా ఉన్న ఫైర్ అని వర్ణించాడు. శ్రీ సత్య శేఖర్ కమ్ముల సినిమాలో హీరోయిన్ టైప్, గీతు సీతక్క లాంటిది, నేహా చౌదరి స్ప్రింగ్.. ఇంకా అభినయశ్రీ అదే విధంగా సుల్తానా నీ పాజిటివ్ గానే బాలాదిత్య వర్ణించటం జరిగింది.
ఇక “ఐటెం నెంబర్” సెకండ్ రౌండ్ లో ఆదిరెడ్డి వర్సస్ రేవంత్ గేమ్ ఆడగా.. రెండు గ్రూపులు కూడా సరి సమానంగా గెలుచుకోవడం జరిగింది. ఈ సందర్భంలో కంటెస్టెంట్ ఆదిరెడ్డి చేత నాగార్జున డ్యాన్స్ వేయించడం హౌస్ లో ఉన్న సభ్యులతోపాటు బిగ్ బాస్ వేదికపై ఉన్న ఆడియన్స్.. ఆదిరెడ్డి స్టెప్పులను బాగా ఎంజాయ్ చేశారు. అనంతరం డేంజర్ జోన్ లో నలుగురు ఉండగా రేవంత్ సేవ్ అయినట్లు.. నెంబర్ ప్లేట్ టాస్క్ ద్వారా తెలియజేశారు. “ఐటెం నెంబర్” టాస్క్ లో మూడో రౌండ్ గీతు వర్సెస్ శ్రీ సత్య మధ్య పోటీ నెలకొంది. ఈ రౌండ్ లో శ్రీ సత్య అద్భుతంగా రాణించడంతో “ఐటెం నెంబర్” టాస్క్ లో A టీం గెలుపొందింది. అనంతరం కొబ్బరి బొండాల నీలతో జార్ నింపాలని డేంజర్ జోన్ లో ఉన్న ముగ్గురు ఆరోహి, అభినయశ్రీ, సుల్తానా కి టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ లో ఆరోహి సేవ్ అయింది.
ఈ టాస్క్ స్టార్ట్ కాకా ముందు ఈ ముగ్గురి పై మిగతా ఇంటి సభ్యుల అభిప్రాయం తెలియజేయాలని నాగార్జున ప్రకటించగా దాదాపు హౌస్ లో 14 మంది సుల్తానాకి వ్యతిరేకంగా నెగిటివ్ కామెంట్లు చేశారు. దీంతో సుల్తానా కన్నీటి పర్యంతం అయింది. అనంతరం డేంజర్ జోన్ లో ఉన్న ఇద్దరు అభినయశ్రీ, సుల్తానా నీ గార్డెన్ ఏరియాకి వెళ్లాలని ఆదేశాలు ఇచ్చారు. ఇద్దరిలో ఒకరే సేవ్ అవుతారని ఇంటి సభ్యులంతా ఏదైనా మాట్లాడాలనుకుంటే ఇప్పుడే మాట్లాడాలని తెలియజేశారు. దీంతో వీరిద్దరితో కొంతమంది ఎమోషనల్ గా మాట్లాడటం జరిగింది. అనంతరం ఇద్దరు గార్డెన్ ఏరియా వెళ్ళటంతో అక్కడ ఇద్దరి ఎదుట సుత్తి పెట్టడం జరిగింది. ఎవరి సుత్తి ఎత్తితే వారు సేవ్ అయినట్లు నాగార్జున తెలిపారు. అయితే ఇద్దరూ కూడా సునాయాసంగా తమ ఎదుట ఉన్న సుత్తి పైకెత్తేశారు. దీంతో ఇద్దరూ కూడా సేవ్ అయినట్లు నాగార్జున ప్రకటించారు. సీజన్ సిక్స్ లో మొదటి వారం ఎవరు ఎలిమినేట్ కావడం లేదని అన్నారు. అంతేకాదు హౌస్ లో వచ్చి కొద్ది రోజులే కాబట్టి..అర్థం చేసుకోవడానికి కొద్దిగా టైం పడుతుంది. ఈ వారానికి బిగ్ బాస్ వదిలేస్తున్నారు అని నాగార్జున తెలియజేసి ఎపిసోడ్ ముగించడం జరిగింది. పరిణామంతో ఇంటిలో ఉన్న సభ్యులకు చూస్తున్న ప్రేక్షకులకు బిగ్ బాస్ షాక్ ఇచ్చినట్లు అయింది.