Bigg Boss Season 6 Day 7 First Promo: బిగ్ బాస్ సీజన్ 6 ఆదివారం ఎపిసోడ్ కి సంబంధించి విడుదలైన ప్రోమోలో ఇంటి సభ్యుల చేత రకరకాల టాస్కులు హోస్ట్ నాగార్జున ఆడించినట్లు చూపించారు. సండే ఫన్ డే అంటూ ఇంటి సభ్యులందరికీ రకరకాల టాస్క్ లు ఇవ్వడం జరిగింది. టాస్క్ లో భాగంగా హౌస్ లో ఇంటి సభ్యులకు గురించి రకరకాల ప్రశ్నలు వేశారు. శ్రీ హాన్, సూర్య, షానీ, గీతు వీళ్లకు సంబంధించి అనేక ప్రశ్నలు వేశారు. ఇదే సమయంలో ఇంటి సభ్యులందరు ముందు బజర్ పెట్టారు. జవాబు తెలిసిన వాళ్ళు ముందుగా ఎవరు బజర్ నొక్కుతారో.. వాళ్లకి పాయింట్స్ అన్న తరహాలో గేమ్ ఆడించడం జరిగింది.
ఇంకా హౌస్ కి కొత్త కెప్టెన్ అయినా బాలాదిత్యా నీ ఇంటిలో ఉన్న అమ్మాయిలను వర్ణించాలని టాస్క్ ఇచ్చారు. బుట్ట బొమ్మ అనే టైటిల్ ఎవరికి ఇస్తావు అనగా.. మెరీనాకి ఇస్తున్నట్లు బాలాదిత్య తెలియజేశారు. దీంతో సేఫ్ గేమ్ ఆడుతున్నావ్ భలేగా అంటూ నాగార్జున మెచ్చుకున్నారు. అనంతరం శ్రీ సత్య పేరు చెప్పగా శేఖర్ కమ్ముల సినిమాలో హీరోయిన్. వాసంతి గ్లామర్ ఆఫ్ బిగ్ బాస్, ఫైమా చూడటానికి ఫ్లవర్ లాగా ఉన్నాడు అని ఫైర్ అని బాలాదిత్య వర్ణించడం జరిగింది.
ఇదే సమయంలో గేమ్స్ ఆడుతూనే మరోపక్క హౌస్ లో ఎలిమినేషన్ కార్యక్రమం జరుగుతుందని నాగార్జున ప్రోమో స్టార్టింగ్ లో తెలియజేశారు. బిగ్ బాస్ సీజన్ 6 మొదటివారం ఏడుగురు ఇంటి నుండి ఎలిమినేట్ అవ్వడానికి నామినేట్ అయ్యారు. అయితే వీరిలో శనివారం ఎపిసోడ్ లో ఇద్దరు సేఫ్ అయినట్లు ప్రకటించడంతో ప్రస్తుతం ఐదుగురు డేంజర్ జోన్ లో ఉన్నారు. దీంతో ఈ ఐదుగురిలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది చాలా సస్పెన్స్ గా నెలకొంది.