Bigg Boss 6: టెలివిజన్ రంగంలో ప్రపంచవ్యాప్తంగా బిగ్ బాస్ రియాల్టీ షోకి మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ఇండియాలో ఈ షో స్టార్టింగ్ లో హిందీలో ప్రారంభమైంది. ఆ తర్వాత ఐదు సంవత్సరాలు క్రితం దక్షిణాదిరంగంలో ఈ రియాల్టి షో పలు బాషలలో ప్రసారం అవుతూ వస్తూ ఉంది. తెలుగులో ఇప్పటివరకు ఐదు సీజన్ లు దిగ్విజయంగా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఆరో సీజన్ రన్ అవుతుంది.
తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ఆరో సీజన్ స్టార్ట్ అయ్యి వారం రోజులు కావస్తోంది. అయితే ఈ ఆరో సీజన్ శనివారం జరిగిన ఎపిసోడ్ లో ఓ స్పెషాలిటీ నెలకొంది. అదేమిటంటే చాలాకాలం తర్వాత బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్ లకు ఆడియన్స్ రావటం. కరోనా నేపథ్యంలో సీజన్ 4 ఇంకా సీజన్ 5 లకి ఏ ఒక్క ఆడియన్స్ వీకెండ్ ఎపిసోడ్ లో కనబడలేదు. నాగార్జున ఒక్కరే వచ్చేవాళ్ళు.. ఎపిసోడ్ కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోయేవారు.
కానీ ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు తగ్గడంతో పాటు సాధారణ పరిస్థితిలు నెలకొనడంతో… ఆరో సీజన్ లో షో నిర్వాహకులు ఆడియన్స్ నీ తీసుకురావడంతో హోస్ట్ నాగార్జున మంచి ఎనర్జిటిక్ గా షో నడిపించారు. అంతేకాదు మొదటి వారం హౌస్ వాతావరణానికి సంబంధించి కొన్ని ప్రశ్నలను కూడా ఆడియన్స్ కి వేయడం జరిగింది. ఏది ఏమైనా చాలాకాలం తర్వాత తెలుగు బిగ్ బాస్ హౌస్ లో వీకెండ్ ఎపిసోడ్ లలో ఆడియన్స్ రావటం విశేషం.