ప్రతిసారి కంట్రోల్ చేయడం నచ్చని కార్తీక్ కోపంతో మోనితని రోడ్డు మీదే వదిలేసి కారులో వెళ్లిపోతాడు. కానీ.. అడ్రస్ గుర్తుండదని తెలిసిన మోనిత కంగారు ఆటోలో ఇంటికి వెళుతుంది. అక్కడ కార్తీక్ తలకి మర్దన చేస్తూ దీప కనిపిస్తుంది. అది చూసి కోపంతో ఊగిపోయిన మోనిత.. దీపని చెడామడా తిట్టేస్తుంది. దాంతో.. కోపంతో దీప వల్లే తను ఇక్కడికి వచ్చానని మోనిత మీద అరుస్తాడు. అంతేకాకుండా.. జరిగిన విషయాన్ని అంతా గుర్తు తెచ్చుకొని చెబుతాడు. అది చూసి ఇలాగే ఉంటే అంతా గుర్తొచ్చే అవకాశం ఉందని భయపడుతుంది మోనిత. అలాగే దీపకి క్షమాపణలు చెప్పమని అంటాడు కార్తీక్. దాంతో.. దీపని కౌగిలించుకుని కావాలనే రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది మోనిత. దీప కూడా మోనితకి అదే స్థాయిలో రిప్లై ఇస్తుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 10 ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
‘గతం మర్చిపోయిన వారికి ఓ సమస్య ఉంది. ఏది ఎప్పుడ గుర్తొస్తుందో. ఎంత వరకూ గుర్తొస్తుందో తెలియదు. ఒకవేళ కార్తీక్‌ని మోనిత దగ్గర నుంచి దీప తీసుకొచ్చింది మాత్రమే గుర్తొస్తే.. అప్పుడు మోనిత ఆయని భార్యలాగా.. దీప మోసగత్తెలాగా కనిపిస్తుంది’ అని డాక్టర్ అంటాడు. అది విని అందుకే కార్తీక్‌ని ఆ ఇంటికే తీసుకెళ్లినట్లు దీప చెబుతుంది. అంతేకాకుండా వినాయక చవితికి పూజ చేస్తున్నట్లు , దానికి కార్తీక్ కూడా వస్తున్నాడని పనులు ఉన్నాయని వెళ్లిపోతుంది దీప.
అక్కడ దీప గురించే ఆలోచిస్తుంటుంది దీప. కార్తీక్, దీప మధ్య దూరం పెంచాలనుకున్న కుదరట్లేదని మదన పడుతుంది. ఇంతలో డ్రైవర్ శివ వచ్చి ‘మేడమ్.. దీపక్క వచ్చింది’ అని చెబుతాడు. దీపని అక్క అని పిలవడం నచ్చని మోనిత, శివని లాగిపెట్టి కొడుతుంది. దానికి మీరే వంటలక్క అని పిలుస్తారు కదా అని దీపక్క అని పిలిచానని అంటాడు శివ. దాంతో ఇంకోసారి అలా పిలిస్తే మంచిగుండదు అని వార్నింగ్ ఇస్తుంది. సరేనంటాడు. అనంతరం దీప దగ్గరకి వెళ్లి తోరణాలు బాగా కట్టావు అని అక్కాని అని పిలుస్తుంది. అది విని శివ షాకై కొంచెం పిచ్చెమోనని అనుకుంటాడు. దీప కూడా చెల్లి అంటూ వరుస కలుపుతుంది. అనంతరం కార్తీక్‌ని చూసుకొమ్మని శివని అక్కడి నుంచి పంపేస్తుంది మోనిత. అనంతరం.. దీపతో రేపు పూజకి పిలవమని కార్తీక్ చెప్పాడని చెబుతుంది మోనిత. అంతేకాకుండా.. ‘కార్తీక్ పక్కన భార్యగా కూర్చుని పూజ చేస్తుంటే.. నువ్వు కుళ్లుకుంటూ ఉండడం చూడాలి’ అని అంటుంది మోనిత. ఎప్పటిలాగే.. దీపకి, మోనితకి మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. ఒకరికి ఒకరు మాటకి మాట సమాధానం చెప్పుకుంటారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోతుంది మోనిత.
మరోవైపు.. వినాయక విగ్రహాలను అమ్ముతుంటారు సౌర్య, వారణాసి. విగ్రహాలు కొనడానికి ఎవరూ రావట్లేదని బాధపడుతుంది సౌర్య. దాంతో.. మహారాణిలా ఉండాల్సిన దానివి కష్టాలు పడాల్సి వస్తుందని బాధపడతాడు వారణాసి. ఇంకోసారి అలా మాట్లాడొద్దని వారణాసిని హెచ్చరిస్తుంది సౌర్య. ఇంతలో అటుగా కారులో వచ్చిన సడెన్‌గా కారు ఆపేస్తాడు. సౌర్యని చూస్తూ ఎక్కడో చూసినట్లు ఉందని మోనితతో బాధగా అంటాడు. ఎవరి బిడ్డో బొమ్మలు అమ్ముతుందని జాలిగా అంటాడు. కానీ.. సౌర్యని కార్తీక్ గుర్తుపట్టేశాడేమోనని కంగారు పడుతుంది మోనిత. సౌర్య మీద జాలితో అన్ని బొమ్మలు కొనుక్కుందామని అక్కడికి వెళ్లబోతున్న కార్తీక్‌ని మోనిత ఆపేస్తుంది. శివని తీసుకురమ్మని కోపంగా అరుస్తుంది మోనిత.
దాంతో.. శివ వేగంగా వెళ్లి అన్ని బొమ్మలు కొనేస్తామని వారణాసితో మాట్లాడుతుంటాడు. అది చూసి చాలా సంతోషపడిన సౌర్య.. కారు దగ్గర ఉన్న వారికి థ్యాంక్స్ చెప్పడానికి వెళ్లబోతుంది. ఇంతలో వారణాసి పిలిచి సౌర్యని డబ్బులు లెక్క చూడమంటాడు. సౌర్య కూడా ఆగిపోతుంది. అదే సమయంలో.. కార్తీక్, తన ముఖం సౌర్యకి కనిపించకుండా అడ్డుగా నిలబడి ఉంటుంది మోనిత. అనంతరం వారణాసి, శివ కలిసి బొమ్మలను కారులో సర్దుతారు. అనంతరం అక్కడి నుంచి మోనిత, కార్తీక్ కారులో వెళ్లిపోతారు. అక్కడితో ఈ ఎపిసోడ్‌కి శుభం కార్డు పడుతుంది. తరువాయి భాగం అంటూ.. మరుసటి రోజు మోనిత ఇంట్లో పూజ ఏర్పాట్లు పూర్తి చేస్తారు. ఇంతలో పూజారి భార్యాభర్తలని పూజలో కూర్చొమని అంటాడు. దాంతో.. ‘డాక్టర్ బాబు మీరు నాకో మాట ఇచ్చారు. మర్చిపోతారని చీటిలో రాసిచ్చాను’ అంటుంది దీప. అది విని షాకైన మోనితతో నువ్వు అస్సలు ఊహించని షాక్ ఇస్తానని అంటుంది దీప. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకూ ఆగాల్సిందే.