Bigg Boss Season 6 Day 6 Episode Review: బిగ్ బాస్ సీజన్ సిక్స్ శనివారం వీకెండ్ ఎపిసోడ్ లో హోస్ట్ నాగార్జున ఎంట్రీ ఇచ్చి ఎవరికి ఇవ్వాల్సిన డోస్ వారికీ ఇచ్చేశారు. శనివారం ఎపిసోడ్ ప్రారంభమైన వెంటనే సాంగ్ తో ఎంట్రీ ఇచ్చిన నాగార్జున.. హౌస్ లో చాలా కాలం తర్వాత ఆడియోన్స్ రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. గత రెండు సీజన్ లలో ఆడియన్స్ లేకపోవడం మైనస్ అని తన యాంకరింగ్ కి ఎనర్జీ ఆడియన్స్.. అని తెలియజేశారు. తర్వాత శుక్రవారం జరిగిన ఎపిసోడ్ తెలుసుకుందామని టెలికాస్ట్ చేయించారు. ఇంటిలో శుక్రవారం సాంగ్ అయిపోయాక శ్రీహాన్ మైకు ధరించకపోవడంతో కొత్త కెప్టెన్ బాలాదిత్యా పనిష్మెంట్ ఇచ్చాడు. ఆ తర్వాత జైల్లో ఉన్న గీతు దగ్గర.. యధావిధిగా అందరు గురించి ఆదిరెడ్డి రివ్యూలు ఇవ్వటం చూపించారు. అనంతరం హౌస్ లో నేహా చౌదరి బర్త్ డే సెలబ్రేషన్స్ చేయడం జరిగింది.
ఈ క్రమంలో నేహా చౌదరి బ్రదర్ నీ హౌస్ లోకి తీసుకొచ్చి నేరుగా కలవకపోయినా.. హౌస్ లో గార్డెన్ ఏరియాలో ఉన్న నేహా బ్రదర్ నీ టీవీలో నుండి చూపించి నేహాకి సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు. ఇద్దరు బర్తడే ఒకేరోజు కావటంతో కేక్ కట్ చేయడం జరిగింది. అనంతరం నాగార్జున ఇంటి సభ్యులతో ముచ్చటించారు. ఒక్కొక్కరి.. ఆట గురించి హౌస్ లో వారు వ్యవహరిస్తున్న తీరు గురించి మాట్లాడారు. ఈ క్రమంలో గీతు రాయల్ కి నాగార్జున గట్టిగానే పంచులు వేయడం జరిగింది. ముందుగా సోఫా రూంలో కూర్చున్న రేవంత్ దగ్గర నుండి స్టార్ట్ చేసి హౌస్ లో ఎక్కువగా బూతులు మాట్లాడవద్దు అని నాగార్జున తెలియజేయగా, సార్ నేనా అని రేవంత్ అనగా ఆదిరెడ్డితో చెప్పించమంటావా..? లేకపోతే వీడియోలేయామంటావా..? అని కాస్త సున్నితంగా వార్నింగ్ ఇచ్చారు. ఆట తీరు మార్చుకోవాలని… నువ్వు చాలా ప్రపంచం చూసావ్.. కాస్త మెచ్చుర్ గా గేమ్ ఆడాలని తెలియజేశారు. దీంతో రేవంత్ ఆట తీరు మార్చుకుంటా అని అన్నారు.
ఇదే సమయంలో జంటగా వచ్చిన మెరీనా రోహిత్ లని లేవనెత్తి…, రోహిత్ కాస్త మెరీనా నీ పట్టించుకో ఆమెకు గట్టిగా టైట్ హగ్ ఇవ్వు అని నాగార్జున అన్నారు. దాంతో రోహిత్ తన భార్య మెరీనాని కౌగిలించుకోవడం జరిగింది. మీ ఇద్దరికీ లైసెన్స్ ఉంది. మీరు భార్యాభర్తలు, మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా ముచ్చటేస్తుంది అని నాగార్జున అన్నారు. అనంతరం హౌస్ లో బాగా ఆడే వారిని అభినందించి, ఆడని వారికి క్లాస్ పీకారు. ఈ క్రమంలో కెప్టెన్సీ టాస్క్ సమయంలో సంచాలక్ గా చేసిన ఫైమా నీ అభినందించరు. ఇదే సమయంలో ఫేమస్ ఫైమాగా హౌస్ లో రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాట్లు ఆల్ ది బెస్ట్ చెప్పారు. శ్రీ సత్య పొద్దున్నే లేచి డాన్స్ చేయాలని యాక్టివ్ గా ఉండాలని క్లాస్ తీసుకున్నారు. ఇంకా పేరు విషయంలో సుదీపాకి క్లాస్ పీకారు. నిన్ను పింకీ అనాలా లేకపోతే సుదీపా అనాలా అని క్లాస్ పీకారు. అనంతరం ఆరోహికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
రేవంత్ తో జరిగిన గొడవ డిస్కషన్ చేయటం మాత్రమే కాదు ఆ సందర్భంలో కలుగజేసుకున్న గీతు, ఆదిరెడ్డికి ఇన్ డైరెక్ట్ గా నాగార్జున క్లాస్ తీసుకోవడం జరిగింది. సూర్య విషయానికొస్తే ఇంకా హౌస్ లో బాగా రాణించాలి. నీలో ఆ క్యాపబిలిటీ ఉంది. గేమ్ ఇంకా బాగా ఆడాలి. సూర్య వెలగాలి అని నాగార్జున సూచించారు. ఆ తర్వాత చంటిని లేవనెత్తి ఏది నీ చలాకితనం. అసలు ఇంటిలో పని చేయడం లేదు. కానీ నీ విషయంలో ఎవరైనా నీపై ఆరోపణ చేస్తే.., నువ్వు ఇచ్చే వివరణ చాలా బాగుంది అని నాగార్జున అభినందించారు. రానున్న రోజుల్లో బాగా ఆడాలని కోరారు. అంతేకాదు హౌస్ లో పనిచేయాలని.. చంటికి తెలియజేశారు. ఆ తర్వాత శ్రీహాన్ నీ లేవనెత్తి.. బయట వాళ్ళు పేర్లు.. ఎత్తితే ఎందుకు అంత కోపం..? ఇక్కడ ఆడియన్స్ సపోర్ట్ ఉంటేనే ఇక్కడ ఎవరైనా ఉంటారు. నువైనా ఇంకా ఎవరైనా. కానీ నీకు మంచి హార్ట్ ఉంది. క్లాస్ గ్రూప్ నుండి మాస్ గ్రూపులోకి రావడం నిజంగా దానికి అభినందించవచ్చు. కానీ బిగ్ బాస్ హౌస్ ఏ స్థానం దేన్ని వదులుకోకూడదు అని నాగార్జున సూచించారు.
ఆ తర్వాత షానీతో షో స్టార్ట్ అయిన సమయంలో ఇచ్చిన మూడు టాస్కుల గురించి చర్చించి కొంత కామెడీ చేశారు. ఇంకా కొత్త కెప్టెన్ బాలాదిత్య నీ అభినందించారు. ఇక ఆదిరెడ్డికి గట్టిగానే క్లాస్ తీసుకున్నారు. తర్వాత సుల్తానాకి గట్టిగా క్లాస్ తీసుకున్నారు. అనవసరమైన విషయాల్లోకి వెళ్ళద్దని అన్నారు. నెక్స్ట్ రాజశేఖర్ నీ లేవనెత్తి అసలు నువ్వు హౌస్ లో ఉన్నావో..? లేదో..? తెలియడం లేదని గేమ్ ఆడాలని నాగార్జున తనదైన శైలిలో సెటైర్లు వేశారు. ఇంకా గీతుకి అందరికంటే ఎక్కువగా నాగార్జున క్లాస్ తీసుకోవడం జరిగింది. హౌస్ లో చెప్పాలనుకున్న విషయం సరిగ్గా చెప్పాలి. ఎదుట వాళ్ళకి మనం చెప్పేది…ముందు మనం చేయాలి. మనం చేసి చెబితే బాగుంటుంది. ఈ క్రమంలో నాకు కొంచెం తిక్కుంది సార్.. అని గీతు అంటే.. నువ్వు ఇలాగే అనుకుంటే ఆడియన్స్ కూడా నువ్వు తిక్క దానివి అంటారు. తర్వాత బయటకి పంపించేస్తారు. సంబంధం లేని విషయాల్లో తలదూరిస్తే మొదటి వీక్ లో జైల్లోకి వెళ్లావు. మళ్లీ రాబోయే రోజుల్లో అదే పరిస్థితి వస్తది. గేమ్ పరంగా నువ్వు బాగా ఆడుతున్నావు. కొద్దిగా మాట్లాడే విధానం మార్చుకోవాలని నాగార్జున.. గీతుకి తెలియజేశారు.
Bigg Boss Season 6 Day 6 Episode Review: మరోసారి శ్రీహాన్ కి సుల్తానా కి మధ్య డిస్కషన్
అనంతరం నామినేషన్ లో ఉన్న ఏడుగురిని లేవనెత్తారు. కవర్లో గ్రీన్ పేరు కలిగిన వారు సేఫ్ జోన్ లో ఉంటారు అని నాగార్జున తెలియజేశారు. ఈ క్రమంలో శ్రీ సత్యకి ఇచ్చిన కవర్ లో ఆమె పేరు గ్రీన్ కలర్ లో ఉండటంతో.. శ్రీ సత్య సేఫ్ అని నాగార్జున తెలియజేశారు. ఆ తర్వాత ఇంటి సభ్యులందరికీ కార్డ్స్ ఇవ్వడం జరిగింది. దాదాపు 8 మంది నెగిటివ్ కార్డ్స్ సింగర్ రేవంత్ కి ఇచ్చి పలు కారణాలు తెలియజేశారు. ఇక ఇదే ప్రక్రియలో మరోసారి శ్రీహాన్ కి సుల్తానా కి మధ్య డిస్కషన్ జరిగింది. ఇంకా కొంతమంది పాజిటివ్ గా వేరే వ్యక్తులకు తమ కార్డ్స్ ఇచ్చారు. ఈ ప్రక్రియలో గీతుకి ఫైట్ కార్డు వచ్చింది. దీంతో గీతు అందరితో గొడవ అయ్యే అవకాశం ఉందని.. ఆఖరికి మీతో(నాగార్జున ) ఇంకా బిగ్ బాస్ తో కూడా గొడవ జరగవచ్చని సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇదే సమయంలో మళ్ళీ అనవసరమైన డిస్కషన్ గీతు పెట్టడంతో నాగార్జున కామెడీ చేశారు. ఈ కార్డ్స్ గేమ్ లో ఎక్కువ “కన్నింగ్ కార్డ్స్” గీతుకి వచ్చాయి. “వెన్నుపోటు” సింబల్ ఉన్న కార్డ్ రేవంత్ కి రావడం జరిగింది. ఆ తర్వాత చలాకి చంటి సేఫ్ జోన్ లో ఉన్నట్లు నాగార్జున ప్రకటించారు. దీంతో ఐదుగురు రేవంత్, ఫైమా, సుల్తానా, ఆరోహి, అభినయశ్రీ డేంజర్ జోన్ లో ఉండటంతో.. ఆదివారం జరగబోయే ఎపిసోడ్ లో వీరిలో ఒకరు ఎలిమినేట్ అవుతారని నాగార్జున పేర్కొన్నారు.